వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదుల దాడి: తిరిగి ప్రారంభమైన పెషావర్ సైనిక పాఠశాల

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెషావర్‌లోని ఉగ్రవాద దాడిలో రక్తం చిందించిన సైనిక పాఠశాల సోమవారం తిరిగి ప్రారంభమైంది. డిసెంబర్ 16న పాకిస్ధాన్‌ తాలిబన్ ఉగ్రవాద సంస్ధకు చెందిన తొమ్మిది మంది ఉగ్రవాదులు పెషావర్‌లోని పాఠశాల్లోకి చొరబడి ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

Terror-hit Peshawar school resumes classes today

ఉగ్రవాదుల దాడిలో 132 మంది బాలలు సహా మొత్తం 140 మందిని చంపడం యావత్ ప్రపంచానే కలచివేసిన సంగతి తెలిసిందే. దాడి నేపథ్యంలో పాకిస్ధాన్ ప్రభుత్వం ఈ పాఠశాలను మూసివేసింది. అంతే కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని పాఠశాలలు కొన్ని రోజుల పాటు మూతపడ్డాయి.

ఉగ్రవాదుల దాడుల్లో రక్తపుమడుగుల్లా మారిని తరగతి గదులను పుర్తిగా శుభ్రం చేసి... పాఠశాల్లో ధ్వంసమైన ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపట్టారు. పాక్‌లోని మిగతా పాఠశాలలు కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. తాజాగా పెషావర్ సైనిక పాఠశాల సోమవారం ఉదయం తలుపులు తెరచుకుని తన విద్యార్ధులకు బోధనను ప్రారంభించింది. పాక్‌లోని ప్రముఖ విద్యా సంస్థల వద్ద సాయుధులైన భద్రత సిబ్బందిని మోహరించారు.

English summary
The army-run Peshawar school which was ravaged by Tehreek-e-Taliban Pakistan a few weeks ago resumed its classes Monday, a media report here said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X