Viral Video: ఆకలితో టవల్ మింగేసిన కొండచిలువ.. వీడియో వైరల్..
పాములంటే దాదాపు అందిరికీ భయం ఉంటుంది. కానీ పాముల వీడియోలు చూసేవారు ఎక్కువే ఉంటారు. సాధారణంగా పాములు కప్పలు, ఎలుకలను తింటాయి. అదే కొండచిలువ అయితే జంతువులను అవసరమైతే మనిషిని కూడా తినేస్తాయి. ఇలా కొండ ఆకలితో ఏం తిన్నాదో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ కొండచిలువ టవల్ ను మింగేసింది.
ఆసుపత్రికి తరలింపు..
కప్పలు, జంతువులు తింటే అరిగేది కానీ అది తిన్నది టవల్ కాబట్టి అరగలేదు. దీంతో కొండచిలువ ఉక్కిరిబిక్కిరైంది. అవస్థలు పడుతున్న ఆ కొండచిలువను చూసిన కొందరు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది వచ్చి పైథాన్ ను గమనించి అదో మింగినట్లు అంచనా వేశారు. వెంటనే దాన్ని న్యూ సౌత్ వేల్స్‌లోని SASH జంతు ఆసుపత్రికి తరలించారు.

పైథాన్ కు స్కాన్ చేసి దాని పొట్టలో ఏదో గుడ్డ ఉన్నట్లు గుర్తించారు. దాని కడుపులోకి ఓ టూల్ పైప్‌ను పంపి.. అతి కష్టం మీద ఆ టవల్ బయటకు లాగారు. దీంతో కొండచిలువ ఊపిరి పిల్చుకుంది. అయితే పైథాన్ నోట్లో నుంచి టవల్ ను బయటకు లాగిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.












Click it and Unblock the Notifications