పుతిన్ ఎఫెక్ట్: భారత్ పై ట్రంప్ భారీ కొరడా- ఏకంగా బియ్యంపై
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇటీవలే భారత్ లో పర్యటించారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. రక్షణ సహా పలు వ్యూహాత్మక రంగాలకు సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. భారత్- రష్యా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న సంబంధాలను మరింత బలోపేతం చేసినట్టయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలకడం హైలైట్.
పుతిన్ చేపట్టిన ఈ పర్యటన- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కంటగింపుగా తయారైనట్టుంది. మరోసారి భారత్ పై టారిఫ్ కొరడా ఝుళిపించనున్నారు. ఈ దఫా భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యం, కొన్ని రకాల నిత్యావసర సరుకులపై భారీగా టారిఫ్ విధించే అవకాశాలను పరిశీలిస్తోన్నారు. ఒకవంక పుతిన్ పర్యటన, మరోవంక వాణిజ్య చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోవడం ట్రంప్ ను తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్టు చెబుతున్నారు.

భారత్ తో పాటు కెనడా మీద కూడా కొత్త టారిఫ్ విధించనున్నారు. ఈ రెండు దేశాల నుంచి బియ్యం, ఎరువులు వంటి వ్యవసాయ దిగుమతులపై కొత్త టారిఫ్ విధించే అవకాశం ఉందని పరోక్షంగా తెలియజేశారు. వాణిజ్య చర్చల్లో పురోగతి లేకపోవడం, స్వదేశంలో రైతుల సంరక్షణ కోసం డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్నారు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న అమెరికన్ రైతుల కోసం ఇటీవలే ట్రంప్ 12 బిలియన్ డాలర్ల ప్యాకేజీని కూడా ప్రకటించారు.
విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు డంప్ అవుతున్నాయని, దీనివల్ల దేశీయ ఉత్పత్తిదారులు ఇక్కట్లను ఎదుర్కొంటోన్నారని, వారిని కాపాడటానికి కఠినమైన చర్యలు అవసరమని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇది తమ దేశ ఆర్థిక ప్రయోజనాలకు అత్యవసరమనీ వ్యాఖ్యానించారు. విదేశీ బియ్యం దిగుమతులను ట్రంప్ డంపింగ్గా వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్, వియత్నాం, థాయ్లాండ్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యం దేశీయంగా ధరలను తగ్గిస్తున్నాయనేది అమెరికన్ రైతుల వాదన.
దీన్ని ఎదుర్కోవడానికి కఠినమైన చర్యలు తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. ఇది తమ దేశ రైతుల భవిష్యత్తుకు అత్యవసరమనీ వ్యాఖ్యానించారు. భారత్ నుంచి బియ్యం ఎందుకు డంప్ అవుతోందని, వీటిపై టారిఫ్ వివరాలు ఎలా ఉన్నాయని, బియ్యం దిగుమతులకు ఏవైనా మినహాయింపు ఉన్నాయా అని అప్పటికప్పుడు ఆయన తన అడ్వైజర్ స్కాట్ బెసెంట్ ను అడిగి తెలుసుకోవడం.. దీని తీవ్రతకు అద్దం పడుతోంది.
-
గురి చూసి భారత్ రావాల్సిన విమానంపై అమెరికా భారీ దాడి -
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
ఇరాన్ తో డీల్ లేనట్లేనా ? సర్వనాశనమే- ట్రంప్ ఫైనల్ వార్నింగ్..! -
ఇరాన్ లో మా టార్గెట్ అదే..! అసలు ప్లాన్ బయటపెట్టిన ట్రంప్..! -
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications