వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్క్‌కు కళ్లెం: కొత్తగా వాటాదారుల హక్కుల ప్రణాళిక, కొనుగోలు ప్రకటనతో డైరెక్టర్స్ చర్యలు..

|
Google Oneindia TeluguNews

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ కన్ను ట్విట్టర్‌పై పడింది. ఇప్పటికే మాస్క్‌కు ట్విట్టర్‌లో 9.2 శాతం వాటా ఉంది. కానీ ఆయన వంద శాతం స్టేక్ తీసుకోవాలని.. సోషల్ మీడియాను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు బహిరంగంగా మాట్లాడుతున్నాడు. దీంతో ట్విట్టర్ స్పందించింది. అతనికి బ్రేకులు వేస్తామని.. షేర్లు ఇవ్వబోమని తేల్చిచెప్పింది.

Recommended Video

Elon Musk Vs Twitter : టర్నింగ్ పాయింట్ అదేనా ? అసలు జరిగింది ? | Oneindia Telugu

ట్విట్టర్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కొత్తగా వాటాదారుల హక్కుల ప్రణాళికను విడుదల చేసింది. మాస్క్ ఇచ్చిన ఆఫర్ నిషేధించేందుకు చర్యలకు ఉపక్రమించింది. ట్విట్టర్‌పై నియంత్రణ సాధించడానికి మాస్క్ చేసే ప్రయత్నాలకు ఇదీ ఎదురుదెబ్బగా మారింది. మాస్క్‌ చేతిలో ట్విట్టర్ పెట్టమని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్పష్టంచేశారు.

Twitter Board reveals plan to defeat Elon Musk

కానీ అంతకుముందు మాస్క్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్చగా వెల్లడించే వేదిక ట్విట్టర్ అని చెప్పారు. అందుకోసమే అందులో పెట్టుబడి పెట్టానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్చగా మాట్లాడగలడం సామాజిక అవశ్యకతగా భావిస్తున్నానని తెలిపారు. అయితే ప్రస్తుత రూపంలో ట్వీట్టర్ కొనసాగితే సామాజిక అవశ్యకతకు మద్దతు నిలవలేదని చెప్పారు. ఈ విషయం తాను వాటా కొనుగోలు చేసిన తర్వాత అర్థమైందని తెలిపారు.

మాస్క్ ఆలోచన ఇలా ఉంటే.. వంద శాతం వాటా ఇవ్వబోమని ట్విట్టర్ స్పష్టంచేసింది. అందుకోసం కొత్తగా షరతులు, నిబంధనలను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఆదిలోనే దానికి సోషల్ మీడియా బ్రేకలు వేసింది.

English summary
Twitter has officially responded to billionaire Elon Musk’s offer to buy 100 per cent stake in the company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X