వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదల్లేని స్థితిలో కొండచిలువ: స్కానింగ్ తీసి చూసి కళ్లు తేలిసిన డాక్టర్లు: కడుపులో టర్కీ టవల్‌..!

|
Google Oneindia TeluguNews

సిడ్నీ: మూగజీవాల కడుపుల్లో మినీ కొండల్లా పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర ప్రాణాంతక వస్తువులను వెలికి తీసిన సంఘటనలను చాలానే చూసి ఉంటాం. ప్లాస్టిక్ కవర్లు జీర్ణాశయంలోకి వెళ్లి..వాటిని హరాయించుకోలేక ప్రాణాలను పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదీ అలాంటిదే. కాకపోతే- ఇక్కడ ఉన్నది మూగ జీవాలు కాదు.. కొండచిలువ. అది మిగింది ప్లాస్టిక్ కూడా కాదు.. ఓ టర్కీ టవల్. సముద్రపు ఒడ్డున స్నానం చేయడానికి విదేశీయులు వినియోగించే బీచ్ టవల్.

ఆస్ట్రేలియా బీచ్ వద్ద..

సుమారు నాలుగు అడుగు పొడవు ఉండే బీచ్ టవల్‌ ఆ కొండచిలువ కడుపులోకి ఎలా వెళ్లిందో తెలియట్లేదు గానీ.. దాన్ని వెలికి తీసిన ఉదంతం మాత్రం సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. బీచ్ టవల్‌ను మింగి, ఊపిరి ఆడక గిలగిల్లాడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఆ ప్రాణిని బతికించడానికి కొంతమంది వెటర్నరీ డాక్టర్లు పడిన తాపత్రయం నెటిజన్ల ప్రశంసలను అందుకుంటోంది. ఎక్స్‌ట్రార్డినరీ కేసుగా పేర్కొనే ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

స్కానింగ్ తీసి బిత్తరపోయిన డాక్టర్లు..

స్కానింగ్ తీసి బిత్తరపోయిన డాక్టర్లు..

సిడ్నీ సమీపంలోని షెల్లీ బీచ్ ఓల్డ్ క్వారీ స్వాంప్ అడవుల్లో కదల్లేని స్థితిలో కనిపించిందా కొండచిలువ. దాన్ని గమనించిన కొందరు సందర్శకులు ఈ విషయాన్ని స్మాల్ యానిమల్ స్పెషలిస్ట్ ఆసుపత్రి (ఎస్ఏఎస్‌హెచ్)కి తెలియజేశారు. ఇదో వెటర్నరీ ఆసుపత్రి. సమాచారం అందుకున్న వెంటనే డాక్టర్లు క్వారీ స్వాంప్‌ వద్దకు వెళ్లారు. కొండచిలువను భద్రంగా ఆసుపత్రికి తీసుకొచ్చారు. స్కానింగ్ చేసి చూడగా.. అందులో బీచ్ టవల్ ఉన్నట్లు తేలింది.

ఆపరేషన్ లేకుండా..

ఆపరేషన్ లేకుండా..

వెంటనే దాన్ని తొలగించడానికి ఏర్పాట్లు చేశారు. ఓ చిన్న అల్యూమినియం రాడ్‌ను దాని కడుపులోకి జొప్పించారు. దాని అంచున అమర్చిన తేలికపాటి కటింగ్ ప్లయర్ వంటి సాధనంతో టవల్‌ను వెలికి తీశారు. కొండచిలువ ఆరడుగుల పొడవు ఉంటే.. అది మింగిన టవల్ నాలుగడుగుల పొడవుంది. ఏ మాత్రం ఆలస్యం చేసి ఉన్నప్పటికీ.. దాని ప్రాణాలు పోయేవని డాక్టర్లు చెప్పారు. అంత పెద్ద టవల్ దాని కడుపులోకి ఎలా వెళ్లిందనే విషయం తమకు కూడా అంతుచిక్కట్లేదని అన్నారు.

Recommended Video

#ViralVideo : Two Headed Snake Found In West Bengal || Oneindia Telugu
డాక్టర్ల తెగువకు నెటిజన్ల ప్రశంస..

డాక్టర్ల తెగువకు నెటిజన్ల ప్రశంస..

ఎవరైనా బీచ్ ఒడ్డున వదిలేసి వెళ్లిన టవల్‌ను ఆ కొండచిలువ మింగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ డాక్టర్ల పనితీరుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మనం చేసే పొరపాట్లు ఇతర ప్రాణులకు ఎలాంటి ఉపద్రవాన్ని తీసుకొస్తున్నాయనే విషయం ఈ ఘటనతో మరోసారి స్పష్టమైందని అంటున్నారు. పర్యావరణాన్ని, ఇతర ప్రాణులు, మూగ జీవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికీ ఉందని సూచిస్తున్నారు నెటిజన్లు.

English summary
In an “extraordinary” case at the Small Animal Specialist Hospital in Sydney, Australia, a family’s pet python swallowed an entire beach towel — and its extraction from the serpent was caught on video. “We see all kinds of interesting cases in our Avian and Exotics Department, but it’s not every day we see something quite as unusual and as extraordinary as this case,” SASH wrote on Facebook in a statement accompanying the incredible footage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X