జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ వీడి ఉండకపోతేనే బెటర్.. ఈటల తీరుపై జీవన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

బీజేపీలోకి వెళ్లి ఈటల రాజేందర్‌ తప్పు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ఆయన టీఆర్‌ఎస్‌లోనే కొనసాగి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రగతిశీల భావాలు ఉన్న ఈటల రాజేందర్ ఇండిపెండెంట్‌గా ఉండి పోరాడితే తెలంగాణ సమాజం ఆయన వెంటే ఉండేదని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గల తన నివాసంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో అదనపు కలెక్టర్లకు అధునాతన వాహనాలను అందిస్తున్న ప్రభుత్వం.. ఎవడబ్బసొమ్ము అని విచ్చలవిడిగా ఖర్చు పెడ్తున్నదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్‌, ఆయన బంధువులకు ఉన్న ఆస్తుల వివరాలపైనా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌పై, మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌లు అక్రమంగా బఫర్‌జోన్‌లో, అసైన్డ్‌ భూముల్లో కళాశాలలు నిర్మించారని, వీరిపై ఎందుకు విచారణ చేపట్టలేదని నిలదీశారు.

 etela make a big mistake: jeevan reddy

కరోనా నివారణ చేయడంలో విఫలం అయ్యారని విమర్శించారు. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు. సో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

English summary
etela rajender makes a big mistake for party change mlc jeevan reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X