• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీ యవ్వారం మాములుగా లేదుగా.. ఇంటర్వ్యూ చేసి మరీ, టికెట్

|
Google Oneindia TeluguNews

హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త పంథా తీసుకొచ్చింది. ఆసక్తి ఉన్నవారు బుధవారం ఉదయం 10గంటల నుంచి సెప్టెంబర్ 5ఆదివారం సాయంత్రం 5గంటల్లోపే దరఖాస్తులు సమర్పించుకోవాల్సిందంటూ వెల్లడించింది. అలా అప్లై చేసినప్పుడు దాంతో పాటు రూ.5వేల డీడీ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థులను సెప్టెంబర్ 6వ తేదీన సీనియర్ల బృందం ఇంటర్వ్యూ చేస్తుంది. భట్టి, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ,జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు తోపాటు వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి , కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ సభ్యులుగా ఏర్పాటైన కమిటీ అభిప్రాయాలను ఏఐసీసీకి పంపిస్తారు.

సెప్టెంబర్ 10తర్వాత వెళ్లే నివేదిక ఆధారంగా అభ్యర్థి పేరును ప్రకటిస్తారు. ఇప్పటికే పోటాపోటీగా బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం కష్టపడుతున్నాయి. మధ్యలో కాంగ్రెస్ ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి మరి. ప్రెస్ మీట్‌లో ఈ వివరాలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ తెలియజేశారు. బీజేపీ, టీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజాం ఆస్తుల విషయం తీసుకొచ్చి బండి సంజయ్ మతాలను రెచ్చగొడుతున్నారు. సీలింగ్ ల్యాండ్స్ ఎత్తివేసిన ఘనత, రాజా సంస్థానాలు వారి ఆభరణాలు రద్దు చేసిన ఘనత కూడా ఇందిరా గాంధీదే అన్నారు.

congress party conduct interview who contest by poll

ఏడేళ్లుగా మోడీ సర్కార్ కు నిజాం ఆస్తులు కనిపించలేదా.. కేంద్ర రాష్ట్ర సర్కార్ లు ఆడుతున్న డ్రామా ఇది. ఫ్రజలను రెచ్చగొట్టడానికే ఈ కామెంట్స్ చేస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో బండి పొతే బండి.. ఇల్లు పొతే ఇల్లు అని అన్నారు. ఎన్నికలైపోయాక చేతులెత్తేసింది టీఆర్ఎస్. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధు అంటున్నారు.

Recommended Video

Chiru బృందంలో Mahesh Babu, Allu Arjun | Ys Jagan ఒకే అంటేనే || Oneindia Telugu

మోడీ 15 లక్షలు ప్రతి అకౌంట్ లో వేస్తామన్నారు ఏమైంది. ప్రజా సంగ్రామ యాత్ర ఎవరి కోసం.. ఎవరు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు పెంచి ప్రజా సంగ్రామ యాత్రలు చేస్తున్నారా. బడా కంపెనీలను, సంస్థలను అమ్మడం సరిపోక యాత్రలు చేస్తున్నారా. రాష్ట్ర సర్కార్ ఖజానా ఖాళీచేసి.. పైసల కోసం భూములు అమ్ముకుంటుంది టీఆర్‌ఎస్ నాయకుల అవినీతిపై కేంద్రం ఎందుకు ఊరుకుంటుంది.ఈడీని రంగంలోకి దింపడం లేదెందుకు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్, పాతబస్తీలో ఎంఐఎం ఒక్కటే. అంటూ తీవ్రంగా విమర్శించారు.

English summary
congress party to conduct interview who contest huzurabad bypoll. they ask deposit rs.5 thousand rupees also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X