వడగళ్లు: పొలంలో పడిన పెద్ద పెద్ద వడగళ్లు, ఎక్కడంటే.. (వీడియో)
వర్షం.. ఈదరుగాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల వడగళ్ల వాన కురిసింది. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథనిలో అయితే వడగళ్ల సైజు మరీ పెద్దదిగా ఉంది. అవును పొలంలో ఒక్కో వడగళ్లు రాయి మాదిరిగా పడింది. దానిని ఒకరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదీ కాస్త వైరల్‌గా మారింది. 30 సెకన్ల నిడివి గల వీడియో చూసి.. నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

పొలంలో వడగళ్లు
మంథనిలో గల ఒక పొలంలో వడగళ్లు వరసగా పడ్డాయి. ఆ విజువల్ చూస్తే.. ఇదీ నిజమా.. లేదా అబద్దమా అనే అనుమానం కలుగుతుంది. ఒక్కోటి చిన్న బండ సైజులో ఉంది. వేసిన పొలంలోనే ఆ వడగళ్లు పడ్డాయి. దీంతో పంట ఎదుగుతుందా లేదా అనే సందేహాం కలుగుతుంది. కొద్దీ సేపటిలో అక్కడ చాలా వడగళ్లు కురిసాయి.

వర్షం.. గాలులు
ఇటు హైదరాబాద్, ఆదిలాబాద్‌లో వర్షం కురుస్తూనే ఉంది. మిగతా చోట్ల ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో జనం ఇళ్లలోనే ఉంటున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం లేదు. వృద్దులు, పిల్లల సంగతి అయితే చెప్పక్కర్లేదు. మిగతావారు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇటు చినుకు పడితేనే హైదరాబాద్ మహా నగరం చిత్తడి అయిపోతుంటుంది. నగరంలో వర్షపు నీరు నిలవడంతో లోతట్టు ప్రాంతాల వారు ఇబ్బందికి గురవుతుంటారు. తమ సమస్య పరిష్కరించమని ఎన్ని సార్లు ప్రభుత్వ పెద్దలకు చెప్పినా ఫలితం ఉండటం లేదు. ఇవే విషయాన్ని చెప్పి.. చెప్పి తమకు ఆయాసం వస్తుందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు.

మంచుదుప్పటి
మరో వైపు ఉత్తరభారతాన్ని మంచుదుప్పటి కమ్మేసింది. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాష్ట్రాల్లో భారీ హిమపాతం నమోదు అయింది. అక్కడి మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి వాతావరణం ఉంది. చలిగాలులు వీయడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆస్తమా ఉన్నవారు అయితే ఇంటి నుంచి బయటకు రావడం లేదు. చలిగాలుల తర్వాత కాసేపు ఎండ వచ్చిన జనం సంతోష పడుతున్నారు. కానీ ఆ వెంటనే మబ్బులు వచ్చి.. చల్లని వాతావరణం ఉంది. దీంతో ఊసురుమనడం వారి వంతవుతుంది.