కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రేక్‌కు బదులు క్లచ్ తొక్కడంతో ప్రమాదం.. యాక్సిడెంట్ కాదు హత్య కేసు

|
Google Oneindia TeluguNews

హిట్ అండ్ రన్.. ఎప్పుడు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటున్నాయి. బలిసినోళ్లు తప్ప తాగి, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో పేదలు చనిపోతున్నారు. ఇవాళ కరీంనగర్‌లో కూడా అలాంటి ఘటన జరిగింది. నలుగురు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సీత, జ్యోతి, రాణి, లలితగా గుర్తించారు. కారుపై 7 ఓవర్ స్పీడ్ జరిమానాలు ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ పేరుతో కారు రిజిస్ట్రేషన్‌ ఉంది. పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి.

మైనర్ డ్రైవింగ్..

మైనర్ డ్రైవింగ్..


కారు యజమాని రాజేంద్రప్రసాద్ కొడుకు వర్దన్ కారు నడిపాడని, ఇతనికి 14 ఏళ్లు మాత్రమే ఉంటాయని నిర్ధారించారు. సరిగా డ్రైవింగ్ రాకపోవడంతో ప్రమాదం జరిగింది. వర్దన్‌తోపాటు మరో ఇద్దరు మైనర్లు కారులో ఉన్నట్లు సమాచారం. బ్రేక్‌కు బదులు.. క్లచ్ తొక్కడంతో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ కొడుకు వర్దన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు మైనర్లు కూడా తర్వాత ఆదీనంలోకి తీసుకున్నారు.

సీసీ కెమెరాల పరిశీలన

సీసీ కెమెరాల పరిశీలన

కరీంనగర్ కమాన్ చౌరస్తా నుంచి ప్రమాద ఘటనాస్థలం వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. కారు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులతో కలిసి రాజకీయ పార్టీలు ధర్నా నిర్వహించాయి. నిందితులకు కఠిన శిక్షించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి గంగుల కమలాకర్ రానున్నారు.

రోజూ ఉదయం కారులో వస్తూ..

రోజూ ఉదయం కారులో వస్తూ..

మైనర్లు ప్రతిరోజు ఉదయం కారులో బయటకు వస్తున్నారని సీపీ అన్నారు. అంబేద్కర్ స్టేడియంలో వాకింగ్ కోసం మైనర్లు కారులో వెళ్తారని చెప్పారు. ప్రమాదానికి కారణమైన కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు ఇప్పటికే చాలా ఉన్నాయని సీపీ తెలిపారు. ఘటనపై యాక్సిడెంట్ కేసు కాకుండా హత్య కేసు నమోదు చేశామని సీపీ చెప్పారు. నలుగురు అమాయకుల ప్రాణాలు పోయినందుకు హత్య కేసు నమోదు చేశామన్నారు. మైనర్లకు కారు అందుబాటులో ఉంచడంతో యజమానిపై కేసు నమోదు చేశామని సీపీ తెలిపారు. స్మార్ట్ సిటీ పనుల కోసం రోడ్డుపక్కన గుడిసెలను వారం రోజుల క్రితం తొలగించామన్నారు. కొందరు రోడ్డుపక్కన గుడిసెల్లో ఉండి వృత్తి పనులు చేసుకుంటున్నారని తెలిపారు.

English summary
karimnagar car accident case is murder case cp said. minor press clutch instead of break.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X