కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండి ఇలాఖాలో అసమ్మతి గళం: రహస్య సమావేశం.. హై కమాండ్ ఆరా

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇప్పుడిప్పుడే బలపడుతుంది. ఎమ్మెల్యేల సీట్ల పరంగా కాకుండా.. పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ ఏర్పడుతుంది. ఇంతలో కుమ్ములాటలు కూడా తప్పడం లేదు. అవును బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఇలాకాలో పార్టీ మూడు ముక్కలుగా వీడిపోయింది. అయితే అసమ్మతి నేతలు రహస్యంగా సమావేశం కావడంతో విషయం బయటకు పొక్కింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లా కరీంనగర్‌లోనే స్టార్ట్‌ అయ్యింది. అసమ్మతి నేతలంతా రహస్యంగా భేటీ కావడం కలవరానికి గురిచేస్తోంది. ఈ ఇష్యూను బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. రహస్య భేటీపై నివేదిక ఇవ్వాలని జాతీయ నాయకత్వం తరుణ్‌ చుగ్‌ను ఆదేశించింది. దీంతో నివేదిక తెప్పించుకునే పనిలో తరుణ్‌ చుగ్ ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో హైకమాండ్‌కు నివేదిక పంపనున్నారు.

local bjp leaders meet privately at karimnagar

బండి సంజయ్ ఇలాకాలో సొంత పార్టీకి చెందిన కొంతమంది నేతలు రెండు రోజుల క్రితం రహస్యంగా సమావేశం అయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ తమను పట్టించుకోవడం లేదని కరీంనగర్ జిల్లా స్థానిక నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బండి సంజయ్ స్థానిక కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇచ్చిన గుర్తింపు తమకు దక్కడం లేదని ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. అందులో పలు అంశాలపై చర్చించారు.

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలో అసంతృప్తితో ఉన్న నేతలను కలుపుకొని ఆత్మగౌరవ సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేసినట్లు అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో బీజేపీ హైకమాండ్ ఈ భేటీపై సీరియస్‌ అయ్యింది. అధికార టీఆర్ఎస్‌తో లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే రహస్యంగా సమావేశం అయ్యారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంతటితో కట్టడి చేయకపోతే పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. వారిపై చర్యలకు జాతీయ నాయకత్వం రంగం సిద్ధం చేసుకుంది.

English summary
local bjp leaders meet privately at karimnagar. high command serious on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X