మంచిర్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దళితబంధు దేశానికి ఆదర్శం: ప్రభుత్వ విప్ బాల్క సుమన్

|
Google Oneindia TeluguNews

దళితబంధు పథకాన్ని అధికార పార్టీ కొనియాడుతుంది. దేశంలో ఎక్కడ ఇలాంటి పథకం లేదని మంత్రి కేటీఆర్ అనగా.. ఆదర్శం అని మరో నేత అన్నారు. దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. గురువారం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన దళిత బంధు లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. అంబేద్కర్‌ జయంతి రోజున దళిత బంధు లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ ఆనందంగా ఉందన్నారు.

దళితుల అభ్యున్నతి అంబేద్కర్‌ కృషి వల్లనే సాధ్యమైందన్నారు. లబ్ధిదారుడి పెట్టుబడి రూపాయి కూడా లేకుండా దళిత బంధు పథకం ద్వారా వంద శాతం ప్రభుత్వ నిధులతో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రజల కోసం ప్రాణం పెట్టి పని చేసే ఏకైక నాయకుడు కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న దళిత బంధు, షాదీముబారక్‌, రైతు బంధు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దళిత బంధు పథకంలో దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసి లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి అండగా ఉండేందుకు నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

dalitha bandhu scheme is role model to country

నియోజకవర్గానికి వంద మంది చొప్పున పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశా మన్నారు. నియోజకవర్గానికి 1500 మంది లబ్ధిదారులను రెండో విడతగా ఎంపిక చేశామని, వారికి త్వరలోనే ఎంచుకున్న యూనిట్‌లను అందజేస్తా మన్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలని కేంద్రం పావులు కదుపుతుం దన్నారు. అవసరమైతే సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా 51 శాతాన్ని రాష్ట్రమే కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొ రేట్‌ కంపెనీలకు కట్టబెడుతుందన్నారు. రైతు బంధు ద్వారా రూ.50 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రూ.1600 కోట్లతో చెన్నూర్‌ లిఫ్టు ఇరిగేషన్‌ ద్వారా నియోజకవర్గంలో సాగు నీరందిస్తామన్నారు.

వార్దా నదిపై బ్యారేజీ నిర్మించి ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో నీరిచ్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్‌ రాజ్యాంగం ద్వారా ద ళితుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేశారని, కేసీఆర్‌ దళిత బంధు ద్వారా దళితులు ఆర్ధికంగా నిలదొక్కుకొనేందుకు పూను కున్నాడని, దళితులకు అంబేద్కర్‌, కేసీఆర్‌ ఇద్దరు ఆత్మబంధువులు అన్నారు. ఎంపీ వెంకటేష్‌ నేత మాట్లాడుతూ... అంబేద్కర్‌ జయంతి రోజున యూనిట్‌ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ప్రవీణ్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ సత్య నారాయణ, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, అదనపు కలెక్టర్‌ మఽధుసుధ న్‌నాయక్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గాప్రసాద్‌, జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య, బెల్లంపల్లి, మంచిర్యాల ఆర్డీవోలు శ్యామలాదేవి, వే ణు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

English summary
dalitha bandhu scheme is role model to country trs mla balka suman said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X