కేసీఆర్‌ను నమ్మితే తెలంగాణను అమ్ముతాడు: షర్మిల
కేసీఆర్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగిందని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. ఆనాడు ఉద్యమంలో యువత ప్రాణాలు కోల్పోతే.. నేడు ఉద్యోగాల కోసం త్యాగం చేయాల్సి వస్తోందని చెప్పారు. ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల 33వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం మూటకొండూరు మండలం ఆరెగూడెం గ్రామంలో పాదయాత్ర ప్రారంభించారు. గిరిబోయినగూడెం, దిల్వార్ పూర్ గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. ఆ తర్వాత మూటకొండూరులో వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సాయంత్రం వరకు నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు

ఊరించి.. ఊరించి...
ఎనిమిదేండ్లు ఊరిచ్చి 80వేల ఉద్యోగాలు మాత్రమే ప్రకటించారని కేసీఆర్‌పై షర్మిల ఫైరయ్యారు. పీఆర్ఎసీ, బిశ్వాల్ కమిటీ ప్రకారం రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేలింది. కేసీఆర్ ప్రకటించింది మాత్రం 80వేలే. మిగిలిన లక్ష ఉద్యోగాల గురించి అడిగారు. వందల మంది చనిపోయినా ఏ ఒక్కరినీ పరామర్శించలేదు. ఏ కుటుంబానికి ఓదార్పు ఇవ్వలేదు. ప్రజలు తమ కోసం పనిచేస్తారని ఓట్లు వేస్తే కేసీఆర్ మాత్రం కుటుంబం కోసం పనిచేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 54 లక్షల మంది తమకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం వద్దే దరఖాస్తు పెట్టుకున్నారని అంటే.. కేసీఆర్ పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా స్కిల్ డెవలప్ మెంట్, కార్పొరేషన్ లోన్లు, ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఎంతో మంది ప్రాణాలు దక్కేవన్నారు.

9 నెలల సమయమా..?
కేసీఆర్
కొడుకు
కేటీఆర్
ఉద్యోగాల
భర్తీకి
తొమ్మిది
నెలలు
పడుతుందని
చెబుతున్నాడు.
కేసీఆర్
ముఖ్యమంత్రి
అయ్యాక
కేటీఆర్కు
మంత్రి
పదవి
ఇవ్వడానికి
ఎన్ని
నెలలు
పట్టింది?
ఆయన
కూతురు
ఓడిపోతే
ఎమ్మెల్సీ
పదవి
ఇవ్వడానికి
ఎన్ని
నెలలు
పట్టింది?
ప్రజలు
ఆలోచన
చేయాలి.
మన
పిల్లలకు
ఉద్యోగాలు
ఇవ్వడానికి
ఎనిమిదేండ్లు
వేచి
చూసి,
మరో
తొమ్మిది
నెలలు
వేచి
చూడాలట.
కేసీఆర్
కుటుంబానికి
మాత్రం
క్షణాల్లో
పదవులు
వస్తాయట.
వైయస్ఆర్
హయాంలో
చదువుల
కోసం
ఆత్మహత్యలు
లేవు.
నిరుద్యోగుల
కోసం
ఆత్మహత్యలు
లేవు.
మహిళలు
స్వయం
ఉపాధి
పొందారు.
రైతులు
ఆనందంగా
ఉన్నారు.

నిధులు లేవా..?
కేసీఆర్
నాలుగు
లక్షల
అప్పులు
చేసినా..
ఫీజు
రీయింబర్స్
మెంట్కు
నిధులు
ఉండవు.
ఆరోగ్యశ్రీకి
నిధులు
ఉండవు.
రుణమాఫీ
ఉండదు.
మహిళా
సంఘాల
రుణాలకు
వడ్డీలు
చెల్లిద్దామన్నా
నిధులు
ఉండవు.
బీడి
బిచ్చం
కల్లు
ఉద్దర
అన్నట్లు
నాలుగు
లక్షల
కోట్ల
అప్పులు
చేసి,
రూపాయి
లేదంటున్నాడు
కేసీఆర్.
అత్త
సొమ్ము
అల్లుడు
దానం
చేసినిట్లు
ఈరోజు
కేసీఆర్
ప్రజలను
తాకట్టుపెట్టి
అప్పులు
తెచ్చి,
ఆ
అప్పులను
మళ్లీ
ప్రజలపైనే
రుద్దుతున్నాడు.