నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జర్నలిస్ట్ రఘు లేఖాస్త్రం: ప్రధాని మోడీకి 5 అంశాల గురించి ప్రస్తావన, రక్షించాలని వేడుకోలు

|
Google Oneindia TeluguNews

జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన భార్య లక్ష్మీ ప్రవీణ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే రఘు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారని సోషల్ మీడియాలో మేసెజ్ ఫార్వార్డ్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వ అక్రమాల గురించి అందులో ప్రస్తావించినట్టు ఉంది. రఘు రాసిన లేఖలో ఏముందో చుద్దాం పదండి.

తెలంగాణలో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను అని రఘు లేఖను ప్రారంభించారు. నిన్న(గురువారం) ఉద‌యం తన ఇంటి స‌మీపంలో కొంద‌రు కిడ్నాప్ చేశారు. ఐదు అంశాల గురించి వార్త‌ల ప్ర‌సారం ఆపితేనే నేను ప్రాణాల‌తో బ‌తుకుతాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాత కిడ్నాప్ చేసిన‌వారు పోలీసుల‌ని తెలిసింది. సోష‌ల్ మీడియాలో నా కిడ్నాప్ అంశం వైర‌ల్ కావ‌డంతో న‌న్ను వారు కోర్టులో హాజ‌రుప‌రిచి జైలుకు పంపించారు. ప్ర‌స్తుతం నేను జైలు నుంచి మీకు ఈ లేఖ రాస్తున్నాను. కిడ్నాప్ చేసిన పోలీసులు.. న‌న్ను వార్త‌లు ప్ర‌సారం చేయొద్ద‌ని కోరిన 5 అంశాలు.

1. పుప్పాల‌గూడ కాందీశీకుల భూమి ఆక్ర‌మ‌ణ‌.
2. ఐడీపీఎల్ 500 ఎక‌రాల ఆక్ర‌మ‌ణ‌.
3. ఐకియా ముందు 43 ఎక‌రాల భూమి ఆక్ర‌మ‌ణ‌.
4. ప్రాజెక్టుల దోపిడి.
5. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో క‌రోనా ట్రీట్‌మెంట్ దోపిడి.

100 ఎకరాల భూమి..

100 ఎకరాల భూమి..


పుప్పాల‌గూడ‌లో 100 ఎక‌రాల కాందీశీకుల భూమి ప్ర‌స్తుతం ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతోంది. ఈ భూమి విలువ రూ.50 వేల కోట్లు. రైతుల‌ను బెదిరించి, నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూక‌బ్జా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు అధికార పార్టీ నేత‌లు, వారి బంధు మిత్రులు. చట్ట వ్యతిరేకంగా అక్ర‌మ నిర్మాణాల‌కు అనుమ‌తిలిస్తున్నారు. ఆ విష‌యం గురించి రిపోర్ట్ చేయ‌కూడ‌ద‌ట‌.

500 ఎకరాల ల్యాండ్

500 ఎకరాల ల్యాండ్

ఐడీపీఎల్/ హిందుజ /గ‌ల్ప్ ఆయిల్‌కు చెందిన 500 ఎకరాల భూమిని మింగుతున్నారు ప్ర‌భుత్వ పెద్ద‌లు. దీని విలువ రూ.10 వేల కోట్లు. ఈ విష‌యం గురించి కూడా నేను మాట్లాడ‌కూడ‌ద‌ట‌. ఇదే అంశంపై బెదిరిస్తున్నారని వాపోయాడు.

ప్రైవేట్ చేతికి ఎలా

ప్రైవేట్ చేతికి ఎలా

హైటెక్ సిటీ స‌మీపంలో ఐకియాకు ముందు యూఎల్‌సీకి స‌రెండ‌ర్ చేసిన 35,36,47,53 స‌ర్వే నెంబ‌ర్ల భూమి ప్ర‌భుత్వం చేతిలో నుంచి ప్రైవేట్ చేతిలోకి ఎలా వ‌చ్చిందో ప్ర‌శ్నించ‌కూడ‌ద‌ట‌.

60 వేల కోట్ల అవినీతి

60 వేల కోట్ల అవినీతి

రాష్ట్రంలో మిష‌న్ భ‌గీరథ‌తో పాటు ప్రాజెక్టుల‌న్నింటిలో రూ.60 వేల కోట్ల అవినీతి జ‌రిగింది. ఆ డ‌బ్బంతా రాజ‌కీయ నాయ‌కుల‌కు చేరింది. ప‌క్క రాష్ట్రం క‌ర్ణాట‌క‌తో పోలిస్తే అదే కాంట్రాక్టర్ చేసిన రేట్లతో పోలిస్తే తెలంగాణ ప్రాజెక్టుల్లో విప‌రీత దోపిడి జ‌రిగింది. ఆ ప్రాజెక్టులు, టెండ‌ర్ల దోపిడి గురించి నేను మాట్లాడకూడ‌ద‌ట‌.

కరోనా పేరుతో దోపిడీ

కరోనా పేరుతో దోపిడీ


క‌రోనా స‌మ‌యంలో విప‌రీత‌మైన దోపిడికి తెగ‌బ‌డి శ‌వాల‌తో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై క‌థ‌నాల‌ను త‌క్ష‌ణం ఆపివేయాల‌ట‌. వాస్తవానికి ఒక్కో ఆస్పత్రి అడ్వాన్స్ పేరుతో నిలువుదోపిడీ చేసిన సంగతి తెలిసిందే.

Recommended Video

Popular Telugu YouTube Host #TNR Lost Life | Oneindia telugu
రక్షించండి ప్రభు..

రక్షించండి ప్రభు..

ప్ర‌ధానమంత్రిగా మిమ్మ‌ల్ని ఈ అంశాల‌పై దృష్టి సారించాల‌ని కోరుతున్నాను రఘు వేడుకున్నారు. పౌర‌హ‌క్కులు, ప‌త్రికా స్వేచ్ఛ‌లేని తెలంగాణ ప‌రిస్థితిని మీరు మారుస్తార‌ని ఆశిస్తున్నాను. తన ప్రాణాలకు భద్రత లేదు, నాకు రక్షణ కలిపించాలని రఘు గంజి ప్రధాని మోడీని లేఖలో కోరారు.

English summary
journalist raghu write letter to prime minister narendra modi for his arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X