నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

1952 తర్వాత ఇలాంటి ఎన్నికలు చూడలేదు: చింతా మోహన్

|
Google Oneindia TeluguNews

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ చిందులేశారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ మధ్యలో చేతులెత్తేశాడని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో నిమ్మగడ్డ... ఐస్‌గడ్డలా కరిగిపోయారని ఎద్దేవా చేశారు. సోమవారం చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నికలను చూడలేదని చెప్పారు.

రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను భ్రాయభ్రాంతులకు గురిచేశారని చింతా మోహన్ మండిపడ్డారు. కర్ణాటక, తెలంగాణ లిక్కర్, ఎర్రచందనం అక్రమ కేసులు పెడతామని పోటీదారులను బెదిరించారని ఆరోపించారు. చాలా చోట్ల భయపెట్టి ఏకగ్రీవాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక, నగర పాలక సంస్థ ఎన్నికలు ఫేక్ ఎన్నికలని చింతామోహన్ చెప్పారు.

chinta mohan slams sec nimmagadda rameshkumar

రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎన్నికల కమిషనర్ పదవీ చేపట్టకూడదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం శుభ పరిణామం అని చెప్పారు. రూ.300 కోట్లతో టీటీడీ చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణం చేస్తామని, ఎన్నికలకు ముందు ఎంఓయూ చేసుకోవడం ఒక రాజకీయ జిమ్మిక్కు అని పేర్కొన్నారు. రూ. 300 రూపాయలు లేని వ్యక్తి, మూడు వందల కోట్లు పెట్టి ఆస్పత్రిని ఎలా నిర్మిస్తారని చింతామోహన్ ప్రశ్నించారు. వాళ్లు చెప్పే మాటలు అబద్దం అని.. మాయ చేస్తున్నారని మండిపడ్డారు.

English summary
senior leader chinta mohan slams sec nimmagadda rameshkumar on municipal elections 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X