చివరి నిమిషంలో హితేష్ తప్పుకోవడం వెనుక.. అసలు కారణం!
ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న దగ్గుబాటి హితేష్ చివరి నిమిషంలో తప్పుకోవడం వెనుక అమెరికా పౌరసత్వం అడ్డు పడింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి దంపతుల కుమారుడు హితేష్ కు అమెరికా పౌరసత్వం ఉంది. హితేష్ కే కాదు.. ఆయన సోదరి కూడా అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్నారు.
విదేశీ పౌరసత్వం ఉన్నవారు భారత దేశంలో జరిగే ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు ఉండదు. నిబంధనలు దీనికి అంగీకరించవు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రద్దు కావాలంటే- అమెరికన్ కాన్సులేట్ కు లేఖ రాయడం దగ్గరి నుంచి పలు నియమాలను అనుసరించాల్సి ఉంటుంది. ఇది సుదీర్ఘ ప్రక్రియ. నిజానికి- రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నప్పుడే..హితేష్ అమెరికా కాన్సులేట్ కు లేఖ రాశారు.

నిబంధనల ప్రకారం.. అన్ని చర్యలు తీసుకున్నారు. ఉత్తర, ప్రత్యుత్తరాలు నడిచాయి. పౌరసత్వం రద్దు కావడానికి మరికొంత సమయం పట్టొచ్చంటూ హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ వద్ద నుంచి తాజాగా సమాచారం అందింది. దీనితో హితేష్ వెనక్కి తగ్గక తప్పలేదు. హితేష్ కు బదులుగా ఆయన తండ్రి, సీనియర్ పొలిటీషియన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ సీపీ తరఫున పర్చూరు అసెంబ్లీ బరిలో పోటీ చేయబోతున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications