హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్‌లో 6గురి అరెస్ట్: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల నిందితులకు సాయం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆగస్టు 15 వేడుకల నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చన్న ఐబీ హెచ్చరికల నేపథ్యంలో.. భాగ్యనగరంలో పోలీసులు జల్లెడపట్టారు. ఆరుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇందులో బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు, పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. 30 ఏళ్ల మహమ్మద్ నాసిర్ (బంగ్లాదేశ్), 55 ఏళ్ల మసూద్ అలీ ఖాన్ (బంగ్లాదేశ్), 24 ఏళ్ల పైసల్ మహ్మద్ (బంగ్లాదేశ్), 31 ఏళ్ల సోహెల్ (పాకిస్తాన్)లు ఉన్నారు. మహ్మద్ ఉస్మాన్, జియా ఉల్ రెహ్మన్‌లను అనుమానితులుగా తెలుస్తోంది.

ఆరుగురు అనుమానితుల అరెస్టు నేపథ్యంలో భాగ్యనగరంలో హైటెన్షన్ కనిపిస్తోంది. పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. పట్టుబడ్డ నిందితులకు హుజీతో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకరికి ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నట్లుగా తెలుస్తోంది.

5 suspected militants arrested in Hyderabad

నిందితుల్లో కొందరు దిల్‌సుఖ్ నగర బాంబు పేలుళ్ల నిందితులకు సాయం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల తర్వాత దేశం విడిచి పారిపోయేందుకు వీరు సాయం చేశారని భావిస్తున్నారు. ఉగ్రవాదులు హైదరాబాదులో భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

నిందితులను చంచల్ గూడ జైలు సమీపంలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇద్దరు స్థానికులు అని సమాచారం. వారు వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా పోలీసులు అదుపులో మరో 15 మంది అనుమానితులు ఉన్నట్లుగా సమచారం.

English summary
The Hyderabad police is investigating the role of five persons who were arrested on the suspcion that they were members of the Harkat-ul-Jihadi Islami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X