క్యాంపస్ ప్లేస్‌మెంట్: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థినికి కళ్లు తిరిగే ప్యాకేజీ..!
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ)లో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాయి. వేర్వేరు దశల్లో ఈ యూనివర్శిటీ క్యాంపస్‌లో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ క్యాంప్స్‌లల్లో 200 మందికి పైగా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో ఉద్యోగాలను పొందారు. మంగళ, బుధవారాల్లో నిర్వహించిన ప్లేస్‌మెంట్స్‌లో మరో 35 మంది ఎంపిక అయ్యారు.
Recommended Video

43 లక్షల రూపాయల ప్యాకేజీతో
మహారాష్ట్రకు చెందన వీ నందిని సోని అనే విద్యార్థిని బంపర్ ఆఫర్ కొట్టేశారు. సంవత్సరానికి 43 లక్షల రూపాయల ప్యాకేజీతో ఆమె అడోబ్ సిస్టమ్స్ సంస్థలో ఉద్యోగం లభించింది. ఈ విషయాన్ని యూనివర్శిటీ ప్లేస్‌మెంట్స్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ బ్యూరో ఛైర్మన్ ప్రొఫెసర్ రాజీవ్ వాంకర్ తెలిపారు. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ అడోబ్ సిస్టమ్స్. మహిళల సాధికారికత @ షి కోడ్స్ కాన్సెప్ట్ కింద విద్యార్థినుల కోసమే ప్రత్యేకంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ను నిర్వహించింది.
సోనికి భారీ ప్యాకేజీని ప్రకటించారు
అయిదు రౌండ్ల వారీగా విద్యార్థినులను ఎంపిక చేశారు. ఈ రౌండ్లన్నింటిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు నందిని సోనికి భారీ ప్యాకేజీని ప్రకటించారు అడోబ్ సిస్టమ్స్ ప్రతినిధులు. ఇప్పటిదాకా హెచ్‌సీయూలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లల్లో అత్యధిక ప్యాకేజీని పొందిన విద్యార్థినిగా నందిని సోని రికార్డు సృష్టించారు. చివరి రౌండ్ వరకు నలుగురు విద్యార్థినులను షార్ట్‌లిస్ట్ చేశారు. వారిలో నందిని సోనీకి అత్యధిక ప్యాకేజీ లభించింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో
మహారాష్ట్రలోని బోయిసర్‌లో గల ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌లో ఆమె తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ మాస్టర్స్ చదవారు. అనంతరం ఎంసీఏ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చేరారు. తనకు లభించిన ప్యాకేజీ పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే తాను అడోబ్ సిస్టమ్స్‌లో చేరాల్సి ఉంటుందని అన్నారు. ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా స్థిరపడాలన్న తన కల సాకారమైందని చెప్పారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications