కేసుపై రాయబారం: యాంకర్ ప్రదీప్‌కు 'ప్రముఖ వ్యక్తి' హామీ? పోలీసులు ఏం చెప్పారంటే

Posted By:
Subscribe to Oneindia Telugu
  Anchor Pradeep case : పరారీలో యాంకర్ ప్రదీప్, ప్రముఖ వ్యక్తి రాయబారం !

  హైదరాబాద్: డిసెంబర్ 31న అర్ధరాత్రి తర్వాత మోతాదుకు మించి మద్యం తాగి పోలీసులకు చిక్కిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ తెరవెనుక రాయబారం నడుపుతున్నారా? కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.

  తాగొద్దని చెప్పిన ప్రదీప్ వీడియో, పక్కన అమ్మాయి ఉందా, ఎవరు? (వీడియో)

  కేసు నుంచి తప్పించుకునేందుకు అతను జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అందుకే అజ్ఞాతంలో ఉన్నాడని అంటున్నారు. కేసు నుంచి తప్పిస్తానని ఆయనకు ఓ ప్రముఖ వ్యక్తి హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.

   ఏం జరగకుండా చూసుకుంటానని హామీ

  ఏం జరగకుండా చూసుకుంటానని హామీ

  ఏం జరగకుండా చూసుకుంటానని సదరు ప్రముఖ వ్యక్తి.. ప్రదీప్‌కు హామీ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరు కాకుండా ఉండేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే సీజ్ చేసిన కారును తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

   కొద్ది రోజులు మౌనంగా ఉండాలని

  కొద్ది రోజులు మౌనంగా ఉండాలని

  ఏమీ కాదని, కొన్ని రోజులు మౌనంగా ఉండాలని, ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని, బయటపడతావని సదరు ప్రముఖుడు.. ప్రదీప్‌కు హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. ప్రదీప్ తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారని వార్తలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరనే చర్చ కూడా సాగుతోంది.

   అందరిలాగే ప్రదీప్‌కూ

  అందరిలాగే ప్రదీప్‌కూ

  యాంకర్ ప్రదీప్ సెలబ్రిటీ కాబట్టి పోలీసులు ఉదాసీనత చూపుతున్నారనే ప్రచారంపై ట్రాఫిక్ డీసీపీ అమర్ కాంత్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. అందరినీ సమానంగానే ట్రీట్ చేస్తామని చెప్పారు. కౌన్సెలింగ్‌కు రాకుంటే అందరికీ ఫోన్లు చేసినట్లుగానే, ప్రదీప్‌కు కూడా చేశామని, ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని చెప్పారు.

   కౌన్సెలింగ్‌కు రాకుంటే

  కౌన్సెలింగ్‌కు రాకుంటే

  ప్రదీప్‌కు శుక్రవారం వరకు సమయం ఉందని, ఈ రోజు లేదా రేపు కౌన్సెలింగ్‌కు రావొచ్చునని ఆయన తెలిపారు. ఒకవేళ ఆయన నేరుగా కోర్టుకు వెళ్లినా కౌన్సెలింగ్ తీసుకోవాలని చెబుతారన్నారు. రేపు కూడా రాకుంటే ఛార్జీషీట్ దాఖలు చేసి, వారెంట్ ఇచ్చి కోర్టులో ప్రవేశ పెడతామన్నారు. ఆయనకు ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు.

   మణికొండలో ప్రదీప్, తెలిసిన వారితోనే?

  మణికొండలో ప్రదీప్, తెలిసిన వారితోనే?

  యాంకర్ ప్రదీప్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని చెప్పారు. తాము ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు. కాగా, ప్రదీప్ మణికొండలోని అపార్టుమెంటులో ఉంటున్నారని, తెలిసిన వారితోనే మరో ఫోన్‌తో మాట్లాడుతున్నారని, తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that Anchor Pradeep is trying to escape from Drunk and Drive case.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి