కేంద్ర మంత్రుల రేసులో లక్ష్మణ్ - బండి..!! ఇద్దరిలో దక్కేదెవరికి - ఈ నెలలోనే విస్తరణ..!!

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు - చేర్పులకు రంగం సిద్దం అవుతోంది. కొందరు మంత్రుల రాజీనామా తో కేబినెట్ లో కొత్త వారితో భర్తీ చేయాల్సి ఉంది. త్వరలో జరనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా రానున్న సార్వత్రిక ఎన్నికలను పరిగణలోకి తీసుకొని కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూర్పు ఉండనుంది. అందులో భాగంగా.. ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, వచ్చే ఏడాది కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరంలోనూ 2023లో ఎన్నికలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గంలో ఈ నాలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కేనా

తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కేనా


ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరే కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఏపీ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం లేదు. ఏపీ నుంచి అవకాశం ప్రస్తతానికి కనిపించటం లేదు. కొత్తగా ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలంటే వారికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సి ఉంటుంది.

ఏపీ నుంచి తాజాగా నామినేటెడ్ కోటాలో విజయేంద్ర ప్రసాద్ కు అవకాశం దక్కింది. ఇదే సమయంలో..తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కంటే తెలంగాణ పైన కేంద్ర ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దీంతో.. తెలంగాణ నుంచి కొత్తగా ఒకరికి కేంద్ర కేబినెట్ లో ఛాన్స్ దక్కుతుందని సమాచారం. ఇప్పటికే కేంద్రంలో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, ఉక్కు శాఖ మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ ఇటీవల పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి స్థానాలను భర్తీ చేయాల్సి ఉన్నది.

 తెలంగాణ నుంచి మరో కేంద్ర మంత్రి

తెలంగాణ నుంచి మరో కేంద్ర మంత్రి

పనితీరు ఆధారంగా కొందరు మంత్రులను తప్పిస్తారనే చర్చ కూడా బీజేపీ ముఖ్య నేతల మధ్య జరుగుతోంది. దీంతో..తెలంగాణ నుంచి తాజాగా రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నేత లక్ష్మణ్ తో పాటుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. సామాజిక సమకరణాలు.. తెలంగాణలో ప్రభావం చూపించగలిగే నేతకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కిషన్ రెడ్డి కేంద్రంలో ఇప్పటికే మంత్రిగా ఉండటంతో.. బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బీజేపీ నుంచి తెలంగాణలో కిషన్ రెడ్డి కాకుండా మరో ముగ్గురు లోక్ సభ సభ్యులుగా ఉన్నారు.

తాజాగా.. బండి సంజయ్ తెలంగాణలో పార్టీని నడిపిస్తున్న విధానం.. దూకుడు పార్టీ అధినాయకత్వాన్ని ఆకట్టుకుంది. దీంతో..ఆయనకు కేంద్ర నాయకత్వం వద్ద మంచి గుర్తింపు వచ్చింది. బీజేపీ కార్యవర్గ సమావేశాల ముగింపు వేళ..నిర్వహించిన బహిరంగ సభా వేదిక పైనే ప్రధాని మోదీ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి భుజం తట్టి అభినందించారు.

బీజేపీ టార్గెట్ తెలంగాణ 2023

బీజేపీ టార్గెట్ తెలంగాణ 2023


పలువురు కేంద్ర మంత్రులు ..ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ప్రశంసించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలకే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయని సీనియర్లు అంచనా వేస్తున్నారు. దీంతో..లక్ష్మణ్ పేరు పరిశీలనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. పార్టీ జాతీయ నేతలతో సత్సంబంధాలు సైతం లక్ష్మణ్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే, కొత్తగా రాజ్యసభ అవకాశం కల్పించి..ఆ వెంటనే మంత్రి పదవి ఇస్తారా అనే సందేహం కూడా వ్యక్తం అవుతోంది. రాష్ట్రపతి ఎన్నికలు - పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. దీంతో..బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం పైన తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు ఆసక్తి గా చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+