మరో విద్యార్థి ఆత్మహత్య: చదవుల ఒత్తిడితో నిండు ప్రాణం బలి..

Subscribe to Oneindia Telugu

జడ్చర్ల: విద్యా వ్యవస్థ రోజురోజుకు విద్యార్థుల పాలిట ఉచ్చులా మారుతోంది. విద్య పేరుతో వారిపై పెరుగుతున్న ఒత్తిడికి తాళలేక చాలామంది విద్యార్థులు తనువు చాలిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవల నారాయణ, చైతన్య లాంటి కార్పోరేట్ కాలేజీల్లో ఈ ఉదంతాలు ఎక్కువగా బయటపడ్డాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఓ పదో తరగతి బాలిక ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

another student commits suicide in telangana

జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గోపాల్‌కూతురు సంధ్య(15) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం పూట కూడా క్లాసులు నిర్వహిస్తుండటంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. అయితే సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sandhya, A tenth class student was committed suicide in Jadcharla, Mahabubnagar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి