• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోజు తీరింది, మోహం చాటేశాడు : రహస్య పెళ్లి పేరుతో యువతిని వంచించిన వెంకట్

|

హైదరాబాద్ : ప్రేమ అన్నాడు .. రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ప్రెగ్నెంట్ అయితే ఓసారి తీసేశాడు. అయినా నమ్మడమే ఆమె తప్పయ్యింది. మరోసారి గర్భం దాల్చిన ఆ అతివ ప్రెగ్నెన్సీ తీయించుకోవడాని వెనుకాడింది. దీంతో తన చేష్టలు ఇక సాగవని తెలిసి .. పలాయనం చిత్తగించాడు ఓ ప్రబుద్ధుడు. హైదరాబాద్ నడిబొడ్డున రెహహత్ నగర్‌లో ఓ యువతి వంచకుడు వెంకట్ చేతిలో మోసపోయి తనకు న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించింది మంజుల.

ప్రేమ పేరుతో వంచన

ప్రేమ పేరుతో వంచన

యూసఫ్‌గూడ దగ్గరలోని రెహమత్‌నగర్‌కి చెందిన మంజులకు తల్లిదండ్రులు లేరు. అన్న వదిన ఉన్నారు. ఈ క్రమంలో వెంకట్ అనే సివిల్ ఇంజినీర్ పరిచయం అయ్యాడు. అతనితో చనువుగా మాట్లాడటమే ఆమె పాపమైంది. క్లోజ్‌గా మాట్లాడినందుకే ప్రేమ అన్నాడు. పోనిలే మంచేడేగా అని నమ్మిన ఆ యువతి ఓకే చెప్పడమే ఆమె జీవితం నాశనమైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి .. గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా మ్యారేజ్ చేసుకున్నాడు.

బుద్ధి బయటపడిందిలా ...

బుద్ధి బయటపడిందిలా ...

రహస్యంగా పెళ్లి చేసుకొని .. కాపురం చేశారు మంజుల దంపతులు. తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పాల్సింది .. కానీ ఏదో కారణం చెప్పి కాలం వెళ్లదీశాడు. అయితే ప్రెగ్నెన్సీ రావడంతో వెంకట్ నిజ స్వరూపం బయటపడింది. ఆబార్షన్ చేసుకొమ్మంటే .. తన భర్తనే కదా అని అందుకు అంగీకరించింది మంజుల. ఆ తర్వాత బెంగళూరు, రాజమండ్రి హాస్టల్ లో ఉంచాడని .. గొడవపడితే వెంకటగిరిలో ప్లాట్ తీసుకున్నాడని తెలిపింది. అయితే మరోసారి ప్రెగ్నెన్సీ రావడం .. ఆబార్షన్ కు మంజుల ససేమిరా ఆనడంతో అతని నిజస్వరూపం మంజులకు పూర్తిగా తెలిసిపోయింది. అంతేకాదు మంజులను వదిలివెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే స్విచ్చాప్ రావడం .. ఆయన బంధువులు కూడా ఫోన్‌లో తేలియనట్లు మాట్లాడటంతో మోసపోయానని గ్రహించి .. తనకు న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించింది 3 నెలల గర్భిణీ మంజుల.

బయటపడిన క్రూరత్వం

బయటపడిన క్రూరత్వం

ఫస్ట్ టైం ప్రెగ్నెసీ వచ్చాక ఆబార్షన్ చేయించాక కూడా తనపై దురుసుగా ప్రవర్తించాడని మంజుల వాపోయింది. తనను కొరికి క్రూరత్వాన్ని చాటుకున్నాడని తెలిపింది. అయినా తనతో జీవితం పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, సాధారణ సమయంలో బాగానే ఉండేవాడని మంజుల పేర్కొన్నది. తనను అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని .. పేరెంట్స్ కు దూరంగా ఉండాలని మంజుల డిమాండ్ చేస్తోంది. వెంకట్ పై ఇప్పటికే జూబ్లిహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశానని .. అయితే పోలీసులు కూడా సరిగా స్పందించడం లేదని బాధితురాలు నిట్టూరుస్తోంది.

3 లక్షలు ఇస్తామంటూ ఆఫర్ ..

3 లక్షలు ఇస్తామంటూ ఆఫర్ ..

రహస్యంగా పెళ్లి చేసుకొన్న వెంకట్ .. తనతో తీసుకెళ్లమని కోరితే రావడం లేదంటోంది మంజుల. పెళ్లి చేసుకోనని .. ఎంత కావాలో చెప్పు అని అడుగుతున్నారని చెబుతోంది. రూ.3 లక్షలు తీసుకొని డీల్ సెట్ చేసుకోవాలని కోరుతున్నారని విలపిస్తోంది. ఈ వ్యవహారం మొత్తం నడిపిస్తోంది వెంటక్ బావ అడ్వకేట్ అని ఆరోపిస్తున్నారు బాధితురాలు. తనను అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటే కట్నం రాదని .. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని మంజుల ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని .. లేదంటే చావే శరణ్యమని వేడుకుంటోంది బాధితురాలు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Venkat became a civil engineer. She was sinless to speak to him. Love is just talking about Close. Her life was ruined by the fact that the agree. she said he would marry secretly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more