హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అయూబ్ ఖాన్ మామూలోడు కాడు: 16 ఏళ్లకే హత్య చేశాడు, తండ్రి ఆర్మీలో పనిచేశాడు

కరుడు గట్టిన నేరస్థుడు అయూబ్ ఖాన్ మామూలోడు కాడు. అతను 16 ఏళ్ల వయస్సులోనే ఓ వ్యక్తి హత్యను చేయడంలో పాలు పంచుకున్నాడు. తండ్రి మాత్రం ఆర్మీలో పనిచేశాడు.

By Pratap
|
Google Oneindia TeluguNews

కరుడు గట్టిన నేరస్థుడు అయూబ్ ఖాన్ మామూలోడు కాడు. అతను 16 ఏళ్ల వయస్సులోనే ఓ వ్యక్తి హత్యను చేయడంలో పాలు పంచుకున్నాడు. తండ్రి మాత్రం ఆర్మీలో పనిచేశాడు.

హైదరాబాద్: హైదరాబాదు పోలీసులకు చిక్కిన అయూబ్ ఖాన్ మామూలోడు కాడని తెలుస్తోంది. హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతని తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు. అతను మాత్రం నూనూగు మీసాల వయస్సులోనే నేరప్రపంచంలోకి అడుగు పెట్టాడు. తన 16 ఏళ్ల ప్రాయంలోనే ఓ హత్య కేసులో ఇరుక్కున్నాడు.

హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ ఖానపై 72 కేసులు నమోదయ్యాయి. అయూబ్‌ని పట్టుకునేందుకు పోలీసులు ఎనిమిదిసార్లు లుక్‌ - అవుట్‌ నోటీసు జారీచేశారు. మంగళ వారం హైదరాబాద్ పాతబస్తీ పురానిహవేలి సౌతజోన్‌ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ కోటిరెడ్డి, దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ వివరాల ను వెల్లడించారు.

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఫతేదర్వాజా మహ్మద్‌ అయూబ్‌ ఖాన్‌ నివాసం. ఇతడి తండ్రి జహంగిర్‌ఖాన్‌. ఇండియన్‌ ఆర్మీలో పనిచేశాడు. దేశ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వ హించి పదవీ విరమణ పొందారు. అయూబ్ ఖాన్ మాత్రం 16 ఏళ్ల వయసులో తొలిసారి అసాంఘిక శక్తులతో చేతులు కలిపి దోపిడీకు పాల్ప డ్డాడు. భూ వివాదంలో 1990లో ఖాదర్‌ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు.

అయూబ్ ఖాన్‌పై పిడీ యాక్ట్

అయూబ్ ఖాన్‌పై పిడీ యాక్ట్

హైదరాబాద్ మత ఘర్షణల్లో విధ్వంసం సృష్టించాడు. 1991లో అతడిపై కామాటిపుర, హుస్సేనిఆలం పోలీస్‌స్టేషన్స్‌లో రౌడీషీట్‌ తెరిచారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో 6 హత్యలు, 8 హత్యాయత్నం, 5 టాడా యాక్ట్‌, 9 మారణాయు ధాలు, 2 ఎన్‌డీపీఎస్‌, 2 డెకాయట్‌, రాబరీ, 38 ఇతర కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌ పరిధిలో 2004-06 వరకూ తారాస్థా యికి చేరిన రియల్‌భూమ్‌ను అవకా శంగా మలచుకున్నాడు. భూ వివాదా లు, పంచాయ తీలతో కోట్లాది రూపా యలు సంపాదించాడు.

బిజినెస్ వీసా మీద దుబాయ్‌కి...

బిజినెస్ వీసా మీద దుబాయ్‌కి...

అగస్టు 2014లో బిజినెస్‌ వీసా మీద అయూబ్ దుబాయ్‌ చేరుకుని గోల్డ్‌స్మగ్లర్‌గా మారాడు. హైదరాబాదులో ఉన్న అనుచరుల ద్వారా వ్యాపారాలు చక్కబెడుతూ వ చ్చాడు. గల్ఫ్‌దేశాలతోపాటు మలేషి యా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ తదిత ర దేశాలు తిరుగుతూ వచ్చాడదు. ప్రపంచవ్యాప్తం గా ఉన్న విమానాశ్రయాలకు అతడి పాస్‌పోర్టు వివ రాలు, ఫోటోలు పంపారు. మారుపేర్లు, తప్పుడు సమాచారంతో మూడుపాస్‌పోర్టులు సంపాదించి ఇమ్మిగ్రేషన్‌ అధికారులను బురిడీ కొట్టిస్తూ వచ్చాడు.

పోలీసులు ఇలా వల వేశారు..

పోలీసులు ఇలా వల వేశారు..

నిరుడు లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీచేసిన తర్వాత సౌత్ జౌన్ పోలీసులు హైదరాబాద్‌ పోలీసు కమిషననరేట్‌ ఐటీసెల్‌తో కలసి సాంకేతికపరమైన అంశాలపై సమీక్షించారు. అయూబ్‌ఖాన్‌ కుటుంబ సభ్యులతో కలసి వున్న ఫొటోలను సంపాదించారు. వాటితోపాటు, అత డి పాస్‌పోర్టు సమాచాన్ని అంతర్జాతీయ విమానాశ్ర యాలకు పంపారు.ఈ నెల 25న ముంబై అంతర్జాతీ య విమానాశ్రయ ఇమిగ్రేషన్‌ అధికారులు అయూబ్‌ ఖాన్‌ పాస్‌పోర్టు ద్వారా గుర్తించి సమాచారాన్ని సౌతజోన్‌ పోలీసులకు అందజేసినట్టు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. అయూబ్‌ఖాన్‌పై రెండు నాన్‌బెయిల్‌బుల్‌ కేసులున్నాయన్నారు. నకిలీపాస్‌ పోర్టు కలిగిన అతడిపై కామాటిపుర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసినట్లు చెప్పారు. ఈ కేసులో అరెస్ట్‌ చేసి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపుతున్నట్టు పేర్కొ న్నారు.

మూడు సార్లు హైదరాబాద్ వచ్చాడు..

మూడు సార్లు హైదరాబాద్ వచ్చాడు..

పోలీసులకు లొంగిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా అయూబ్ ఖాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ పరిస్థితిని తెలుసుకునేందుకు 3 సార్లు నగరానికి వచ్చి దుబాయ్‌ వెళ్లాడు. నెలరోజుల క్రితం లొంగిపోయేందుకు ప్లాన్‌వేసుకున్నా అవకాశం చిక్కలేదు. దీంతో షార్జాలో పాస్‌పోర్టు తీసుకుని అమెరికా వెళ్లాలనుకున్నాడు. కానీ అవకాశం కుదరక మాను కున్నాడు. సీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలతో సౌతజోన్‌ పోలీసులు, ఐటీసెల్‌ సహకారంతో అయూబ్‌ఖాన్‌ కొత్తపాస్‌పోర్టు, ఫొటోలను అంతర్జాతీయ విమానాశ్ర యాలకు పంపటంతో పోలీసులకు చిక్కాడు.

మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అయూబ్...

మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అయూబ్...

మధ్యతరగతి కుటుంబలో పుట్టిన అయూబ్‌ఖాన్‌ పేదరికాన్ని అసహ్యించుకునేవాడు. కోట్లు సంపాదించాలని ఆశపడ్డాడు. తాను అనుకున్నది సాధించేందుకు పలు దారుణాలకు పాల్పడ్డాడు. రౌడీషీటర్‌గా మొదలైన అయూబ్‌ ఖాన్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. కోట్లాదిరూపాయలు సంపాదించాడు. 2002లో ఓ భూ వివాదంలో న్యాయవాది మన్నన్‌ఘోరిని హత్యచేశాడు. ఆ కేసులో మూడేళ్ల పాటు జ్యుడిషియల్‌ కస్టడీలో విశాఖపట్ట ణం జైలులో ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఘోరీ హత్యకేసులో సాక్షులను అడ్డుతొలి గించేందుకు ప్రయత్నం చేశాడు. కోర్టుకు హాజరు కాకుండా తప్పింకున్నాడు. 2008లో జంటహత్యల కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. ఆ కేసులో న్యాయస్థానం అయూబ్‌ఖాన్‌కు జీవితఖైదు విధించింది. శిక్షాకాలం అనుభవించేందుకు చర్లపల్లి జైలు అక్కడ నుంచి విశాఖపట్టణం జైలుకు తరలించారు. కిందికోర్టు ఇచ్చిన తీర్పును సాంకేతిక కారణాలతో హైకోర్టు కొట్టివేసింది. 2014 ఏప్రిల్‌ 11న అయూబ్‌ఖాన్‌ జైలు నుంచి విడుదల య్యాడు. పీడి యాక్టు ప్రయోగించిన నేరస్థుల జాబితాలో అయూబ్‌ఖాన్‌ పేరు కూడా ఉండటంతో దుబాయ్‌కి పారిపోయాడు.

English summary
several cases against gangster Ayub Khan, arrested from Mumbai airport following an Interpol alert this week, had fallen flat in courts in the past. Witnesses had been terrorised by his gang and petitioners faced strong arm tactics and turned hostile during the trials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X