నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ కాళ్లు పట్టుకుంటే పదవి, నోరు మూసుకొని రాజీనామా చేసి వెళ్లిపో: డీఎస్‌పై బాజిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డీ శ్రీనివాస్ వ్యాఖ్యలపై నిజమాబాద్ జిల్లా పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. డీఎస్ ఓ చీడపురుగు అని పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. డీఎస్‌కు నీతి, నియమం ఉంటే పార్టీకి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రాజీనామా చేయను, ప్లీజ్ సస్పెండ్ చేయండి, చేతకాకుంటే: డీఎస్ ఎదురుదాడిరాజీనామా చేయను, ప్లీజ్ సస్పెండ్ చేయండి, చేతకాకుంటే: డీఎస్ ఎదురుదాడి

కాంగ్రెస్ పార్టీ హయాంలో డీఎస్ కొడుకు అరాచకాలు బయటపడలేదని ధ్వజమెత్తారు. పార్టీకి చెందిన నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఆయన కొడుకు విమర్శిస్తే ఎందుకు స్బందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కాళ్లు పట్టుకుంటేనే ఆయన రాజ్యసభ ఎంపీగా అయ్యారని చెప్పారు.

నీ కొడుకు గురించి మొత్తం తెలుసు

నీ కొడుకు గురించి మొత్తం తెలుసు

నీ (డీఎస్) కొడుకు గురించి జిల్లా ప్రజలకు మొత్తం తెలుసునని బాజిరెడ్డి అన్నారు. నోరు మూసుకొని పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు డీఎస్ పలు ప్రయత్నాలు చేశారని చెప్పారు.

 నోరు మూసుకొని రాజీనామా చేసి వెళ్లిపో

నోరు మూసుకొని రాజీనామా చేసి వెళ్లిపో

తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, లేదంటే తీర్మానంపై క్షమాపణలు చెప్పాలన్నట్లుగా మాట్లాడటం విడ్డూరమన్నారు. డీఎస్ ఇప్పటికైనా రాజీనామా చేస్తే మంచిదని బాజిరెడ్డి అన్నారు. మీ గురించి ఇంకా చాలా ఉందని అన్నారు. నోరు మూసుకొని రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు.

తన కుటుంబాన్ని రోడ్డుకీడ్చారు

తన కుటుంబాన్ని రోడ్డుకీడ్చారు

కాగా, అంతకుముందు డీ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు తన కుటుంబాన్ని రోడ్డు పైకి ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి తన కుమారుడు సంజయ్‌పై కేసు పెట్టించారని ఆరోపించారు. తన మరో కుమారుడు అరవింద్‌ బీజేపీలో చేరిన విషయంలో తన ప్రమేయం ఏదీ లేదన్నారు.

కేసీఆర్ కేబినెట్లో అసంతృప్తులు

కేసీఆర్ కేబినెట్లో అసంతృప్తులు

కేసీఆర్ కేబినెట్లో చాలామంది అసంతృప్తులు ఉన్నారని డీ శ్రీనివాస్ చెప్పారు. తాను తెరాసలో ఉండటం కవితకు ఇష్టం లేకుంటే సస్పెండ్ చేయాలన్నారు. తెలంగాణ కోసం సమైక్యవాదులకు వ్యతిరేకంగా తాను పోరాటం చేశానని చెప్పారు. తన కొడుకు సంజయ్ విషయంలో ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించిందన్నారు. అక్రమంగా అరెస్టు చేయించిందన్నారు.

English summary
Nizamabad district TRS leader Bajireddy Govardhan Reddy takes on Rajya Sabha MP D Srinivas on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X