• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపి,టీఆర్ఎస్ ప్రజావ్యతరేక పార్టీలకు బుద్ది చెప్పాలి.!షర్మిళ పార్టీలో చేరిన కమలం,గులాబీ నేతలు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ దూసుకెళ్తోంది. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ పాద యాత్ర ప్రభావం తెలంగాణ రాజకీయాలపైన బాగానే చూపినట్టు తెలుస్తోంది. ఇదే వారంలో ఎక్కడ పాదయాత్ర ఆపారో అక్కడనుంచే మళ్లీ మొదలు పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు వైయస్ షర్మిళ. ఈ నేపధ్యంలో తెలంగాణ వైయ్యస్సార్ పార్టీలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు చేరిపోయారు. పాదయాత్ర మళ్లీ పునఃప్రారంభం కానున్న సందర్బంగా మొదలైన చేరికలు పార్టీకి మంచి బూస్టర్ లా పరిణమంచినట్టు తెలుస్తోంది.

షర్మిళ పాదయాత్ర ముందు చేరికలు.. పార్టీకి ఊపునిస్తాయంటున్న నేతలు

షర్మిళ పాదయాత్ర ముందు చేరికలు.. పార్టీకి ఊపునిస్తాయంటున్న నేతలు

వైయ్యస్సార్ తెలంగాణ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతు న్నవైయ్యస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ నాయకత్వంలో పనిచేసేందుకు పలు పార్టీల నాయకులు ముందుకొస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నుండే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పలువురు నాయకులు వైయ్యస్సార్ తెలంగాణ పార్టీలో చేరడం విశేషం. వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ ఆద్వర్యంలో పలువురు టీఆర్ఎస్, బీజేపీ నాయకులు సోమవారం పార్టీలో చేరారు.

షర్మిళ పార్టీలో చేరికలు.. బీజేపి, టీఆర్ఎస్ నేతలకు కండువా కప్పి ఆహ్వానించిర షర్మిళ

షర్మిళ పార్టీలో చేరికలు.. బీజేపి, టీఆర్ఎస్ నేతలకు కండువా కప్పి ఆహ్వానించిర షర్మిళ

హైదరాబాద్ లోని మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు ఎడమ మోహన్ రెడ్డి తన అనుచరులతో కలిసి వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మలక్ పేట్ బీజేపీ నాయకులు, ట్రేడర్ సెల్ సిటీ అధ్యక్షులు నవీన్ రావు, మలక్ పేట్ బీజేపీ సీనియర్ నాయకులు రవికుమార్ చౌకి తమ అనుచరులతో కలిసి వైయ్యస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిళ వారందరికీ పార్టీ కండువా వేసి వైయ్యస్సార్ తెలంగాణ పార్టీలోకి ఆహ్వానించారు.

కేసీఆర్ ది నియంత పాలన.. చరమగీతం పాడాలన్న టీఆర్ఎప్ నేత

కేసీఆర్ ది నియంత పాలన.. చరమగీతం పాడాలన్న టీఆర్ఎప్ నేత

ఈ సందర్భంగా ఎడమ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయ్యస్సార్ వ్యవసాయాన్ని పండుగ చేశారని గుర్తుచేశారు. ఉచిత కరెంటు, రుణమాఫీ, సబ్సిడీలు కల్పించి రైతులను ఆదుకున్నారని పేర్కొన్నారు. పేదలు కార్పొరేట్ వైద్యం పొందాలని ఆరోగ్యశ్రీని పథకాన్ని ప్రవేశపెట్టి వారి బతుకుల్లో ఆనందాన్ని నింపారని తెలిపారు. వైయస్ షర్మిళ నాయకత్వంలో పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు వైయ్యస్సార్ తెలంగాణ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.

దివంగత సీఎం వైయస్సార్ ఎన్నో పథకాలకు రూపక్పన చేసారు.. షర్మిళకు అండగా ఉంటాన్న బీజేపి నేత

దివంగత సీఎం వైయస్సార్ ఎన్నో పథకాలకు రూపక్పన చేసారు.. షర్మిళకు అండగా ఉంటాన్న బీజేపి నేత

బీజేపీ నాయకులు నవీన్ రావు, రవి కుమార్ చౌకి మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలనలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ప్రతిపక్ష పార్టీలు సైతం నిలదీయడంలో విఫలమయ్యాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయ్యస్సార్ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ప్రజల మనస్సులు తెలుసుకుని ఎన్నో గొప్ప పథకాలను అందించారని గుర్తు చేశారు. వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ తండ్రి తగ్గ తనయగా అధికార పార్టీ వైఫల్యాలను నిలదీస్తూ పాదయాత్రతో ప్రజల మనస్సును తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నవీన్ రావు హామీనిచ్చారు.

English summary
Leaders of TRS and BJP have joined the Telangana ysr party. The additions, which began on the eve of the resumption of the Padayatra, seem to have turned out to be a good booster for the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X