స్కూల్ బస్సు ప్రమాదం ఎఫెక్ట్: రికార్డు టైమ్‌లో బ్రిడ్జీ నిర్మాణం

Posted By:
Subscribe to Oneindia Telugu

మెదక్: మెదక్ జిల్లా మూసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద 2014లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గుర్తుండే ఉంటుంది. ఓ ప్యాసెంజర్ రైలు పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సుు ఢీకొట్టడంతో 18 మంది పిల్లల ప్రాణాలు గాలిలో కలిశాయి.

ఆ ప్రమాదం పెట్టిన గుండెకోతను గుర్తు చేసుకుంటూ మెదక్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ ప్రదేశంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మాణానికి పూనుకున్నారు.

Bridge at Moosayipet completed in record time

వంతెన నిర్మాణానికి సాయం అడిగితే కేంద్రం, రైల్వే శాఖ తిరస్కరించాయి. దాంతో విషయాన్ని ప్రభాకర్ రెడ్డి మంత్రి హరీష్ రావు సహకారంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దృష్టికి తీసుకుని వెళ్లారు.

Bridge at Moosayipet completed in record time

దాంతో కేసీఆర్ రూ.1.69 కోట్లు మంజూరు చేశారు. అయితే వంతెనల నిర్మాణానికి నెలలే కాదు, సంవత్సరాలు పట్టిన సందర్భాలున్నాయి. అయితే మెదక్ జిల్లా వెల్తుర్తి మండలం మూసాయి పేట రైల్వే క్రాసింగ్ వద్ద కేవలం నాలుగు గంటల్లోనే రోడ్డు, అండర్ బ్రిడ్జి (ఆర్‌యుబీ)ని పూర్తి చేసి రికార్డు సృష్టించారు.

Bridge at Moosayipet completed in record time

శుక్రవారం పది గంటలకు రైల్వే లైన్‌ను తొలగించి, సిమెంట్ బ్లాక్‌లను ప్లాట్‌ఫారాలను నిర్మించారు. ఆ వెంటనే రైల్వే లైన్‌ను తిరిగి బిగించారు. ఈ పనులన్నీ నాలుగు గంటల్లో పూర్తయ్యాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Within a record time in four hours road and under ground bridge have constricted at Moosayipet in Medak district of Telangana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి