వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బూర నర్సయ్య గౌడ్ సంచలనం: మంత్రి జగదీష్‌పై ఆరోపణలు, టికెట్ రేసులో

|
Google Oneindia TeluguNews

మునుగోడు బై పోల్ గురించే హాట్ హాట్ డిస్కషన్.. విజయం సాధిస్తామని ప్రధాన పార్టీలు విశ్వాసంతో ఉన్నాయి. అయితే నేతల మధ్య సఖ్యత చాలా ముఖ్యం. లేదంటే విజయవకాశాలపై ప్రభావం చూపనుంది. టికెట్ల లోల్లి అన్నీ పార్టీల్లో ఉంది. సామాజిక సమీకరణాలు, స్థానికత అంశం.. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని మరీ కేటాయిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి.

టికెట్ కోసం కోట్లాట

టికెట్ కోసం కోట్లాట

టికెట్ విషయమై టీఆర్ఎస్ పార్టీలో రగడ జరుగుతుంది. సీటు కోసం గొడవ పడుతున్నారు. ఆ జాబితాలోకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా చేరిపోయారు. తాను టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నానని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బలమైన నేతను తానేనని.. తనను కావాలనే పక్కన పెడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని ఆరోపించారు. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డిపై విమర్శలు చేశారు.

 కారణం ఏంటో మరీ..?

కారణం ఏంటో మరీ..?

తనకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడంలో లేదో చెప్పాలని మంత్రిని అడిగారు. తానెప్పుడూ ప్రజల్లో ఉన్నానని అన్నారు. తనకు, కర్నె ప్రభాకర్‌కు పార్టీ సమాచారం అందడం లేదని కామెంట్స్ చేశారు. ఇలా ఎందుకు జరుగుతుందో జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డే చెప్పాలన్నారు. తన బలం తెలిసినా ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. మునుగోడు టికెట్ ఆశించటంలో తప్పేముందని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి పరంగా వెనుకబడిందని చెప్పారు.

 బీసీలు ఎక్కువ

బీసీలు ఎక్కువ

అభివృద్ధి తప్ప ఇతర అంశాలను పట్టించుకోనన్నారు. ప్రజలు దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం బలంగా ఉందని.. తాను బీసీనే అందుకే టికెట్ అడుగుతున్నా అని బూర వివరించారు. ఇలా బూర నర్సయ్య గౌడ్ కూడా తన మనసులో మాటను బయటపెట్టారు. తాను కూడా టికెట్ కోసం రేస్‌లో ఉన్నాననిటు ప్రకటించారు. కావాలనే పక్కన పెడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.

English summary
bura narsaiah goud made sensational comments on minister jagadish reddy. and also comment ticket issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X