
సీఎం కేసీఆర్‌కు జ్వరం, హస్తినకు సీఎస్, స్పెషల్ సీఎస్
సీఎం కేసీఆర్ అనారోగ్య బారిన పడ్డారు. ఆయన ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. లాస్ట్ వీక్ ఉత్తరప్రదేశ్ వెళ్లి.. ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉత్తర ప్రదేశ్ వచ్చారు. ఆ తర్వాత అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లారు.
వారం రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. వెదర్ చేంజ్ ఏమో కానీ.. ఆయనకు జ్వరం వచ్చింది. జ్వరం రావడంతో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ రావాల్సిన షెడ్యూల్ మరింత ఆలస్యమైంది. మరో నాలుగు రోజులు అక్కడే ఉండనున్నారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పాలనకు సంబంధించి సమీక్ష చేయనున్నారు.

టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీ నేతలను కలుస్తూ వస్తున్నారు. చిన్న చితక పార్టీలు.. ఆ పార్టీతో మెర్జ్ అవుతున్నాయి. ఇటీవల మాజీ ప్రధాని దేవే గౌడ కూడా.. బీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీగా అవతరిస్తోందని ప్రకటించారు.