కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము బీజేపీకి ఉందా: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ దోపిడీ చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు, మహిళలు, రైతులు అందరూ ఇబ్బందులకు గురయ్యారని, ప్రజలు ఛీ కొట్టిన తర్వాత బుద్ధి తెచ్చుకుని పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి కోసం పనిచేశారని విమర్శించారు.
బీజేపీ ఎంపీలను బీఆర్ఎస్ గెలిపించింది: సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ సకలం త్యాగం చేసి గత పార్లమెంటు ఎన్నికలలో బిజెపి ఎంపీలను గెలిపించడానికి పని చేసిందని, ఎనిమిది మంది ఎంపీలను గెలిపించింది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా పాలన- ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

కేసీఆర్ , కేటీఆర్ లను ఎందుకు జైల్లో వేయలేదు
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బిజెపికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం స్కామ్ లో, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేసీఆర్ కేటీఆర్ లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అక్రమాల గురించి స్వయంగా మోడీనే నిలదీశారు అని, ఇంకా ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నించారు. ఒకరినొకరు కాపాడుకుంటూ బీఆర్ఎస్, బిజెపి నేతలు రాజకీయాలలో కొనసాగుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్
మున్సిపల్ ఎన్నికల లోపు కెసిఆర్ కేటీఆర్ లను అరెస్ట్ చేసే దమ్ము బిజెపికి ఉందా అంటూ ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం చేసింది ప్రజలకు తెలియజేశారు. సోనియా గాంధీ కరీంనగర్ గడ్డ మీద నుండే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్రము ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పరిస్థితులు అనుకూలించకపోయిన 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని తెలిపారు.
కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నాయకుల విషం
ప్రజా తీర్పు ను గౌరవించాలని ప్రతిపక్షంలో ఉన్నాము. బీఆర్ఎస్ నాయకులు అందివచ్చిన అవకాశాలతో అవినీతి సొమ్మును భారీగా కూడబెట్టారు అని తెలిపారు. ఆ తరువాత 10 సంవత్సరాలకు ప్రజా పాలన ప్రభుత్వం వస్తే బి ఆర్ ఎస్ నాయకులు విషం చిమ్ముతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం ఉచిత కరెంట్ తో దేశానికి ఆదర్శం అయింది. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అన్నారు.
బిఆర్ఎస్, బిజెపిలు చీకటిఒప్పందం చేసుకున్నారు
తాము రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద 10లక్షల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు మహబూబ్‌నగర్ లో పర్యటించారు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను జాతీయ హోదాను ప్రకటించాలని అనిపించలేదు అని బిజెపి నాయకులను ప్రశ్నించారు. మొన్న బడ్జెట్ లో మెట్రో రైలు, మూసి ప్రక్షాళన, నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. బిఆర్ఎస్ నాయకులు అవినీతి చేస్తే వారిని బిజెపి నాయకులు కాపాడుతున్నారు. బిఆర్ఎస్, బిజెపిలు చీకటిఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు.
గోదావరి పుష్కరాలకు ఇలా చేస్తాం
వరివేసుకుంటే ఉరి వేసుకున్నట్లే అని కెసిఆర్ అన్నారు. కాని తన పొలంలో వరి పండించాడన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత సన్నబియ్యం పండించండి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాము, ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆర్ధిక అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. . గోదావరి పుస్కారాల కోసం ఆదిలాబాద్ బాసర నుండి ఖమ్మం భద్రాచలం వరకు ఉన్న అన్ని దేవాలయాలను 4 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications