భూముల డబుల్ రిజిస్ట్రేషన్ లకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ ఫోకస్.. అదే జరిగితే..
తెలంగాణ రాష్ట్రంలో చాలాచోట్ల ఖాళీ స్థలాలు, ఇళ్ళు డబుల్ రిజిస్ట్రేషన్ సమస్య చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది. ఇక ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ స్థలాలు, ఇల్లు డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకతను పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకు కేవలం వ్యవసాయ భూములకే పరిమితం చేసిన టైటిల్ విధానాన్ని, ఇళ్ళు, ఖాళీ స్థలాలకు వర్తింపజేయాలని భావిస్తోంది.
భూముల డబుల్ రిజిస్ట్రేషన్ కు చెక్ పెట్టేలా ప్రభుత్వ కీలక అడుగు
దీని ద్వారా ఆస్తి యజమానులకు పక్కాగా యాజమాన్య హక్కు పత్రాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోటు చేసుకుంటున్న అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణ వంటి అనేక అంశాలను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది.

బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్న ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా కోర్టులలో తేలని ఆస్తుల వివాదాలు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు గమనించిన ప్రభుత్వం రెవిన్యూ రిజిస్ట్రేషన్ల శాఖలను ప్రక్షాళన చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మానవ ప్రమేయాన్ని తగ్గించి అవినీతికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న ప్రభుత్వం బ్లాక్ చైన్ టెక్నాలజీని ఇందులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
డబుల్ రిజిస్ట్రేషన్ కు చెక్ పెట్టే వ్యూహం
ఈ టెక్నాలజీ ద్వారా ఒకసారి ఆస్తి వివరాలు నమోదు చేస్తే, మళ్లీ ఆ ఆస్తిని సదరు వ్యక్తి ఇంకొకరికి డబుల్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండదు. ఒక వ్యక్తి పేరు మీద అప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ఆస్తిని మళ్లీ వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ వ్యక్తిని సిస్టం అనుమతించదు.
డబుల్ రిజిస్ట్రేషన్ లను తిరస్కరించే సాఫ్ట్ వేర్
ఈ టెక్నాలజీ లో ప్రభుత్వ స్థలాలు, చెరువులు వాటికి సంబంధించిన భూములను, నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తుల వివరాలను నిక్షిప్తం చేయడం వల్ల వాటిని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నిస్తే, ఆ సాఫ్ట్వేర్ వెంటనే దానిని తిరస్కరిస్తుంది. దీనివల్ల సబ్ రిజిస్ట్రార్ల ప్రమేయం లేకుండానే అక్రమాలకు చెక్ పడుతుంది.డబుల్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల కబ్జాలను నివారించడానికి సర్వే నెంబర్ బ్లాక్ విధానాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేయబోతుంది.
రియల్ ఎస్టేట్ మోసాలకు చెక్ పెట్టేలా నిర్ణయం
ఈ కొత్త సిస్టంలో ఒక సర్వే నెంబర్లో ఎంత భూమి విస్తీర్ణం ఉంది.. అందులో ఎంత రిజిస్ట్రేషన్ అయింది.. మిగిలింది ఎంత భూమి ఉంది అనే వివరాలు పక్కాగా ఉంటాయి . ఉన్న భూమి కంటే ఒక గజం కూడా ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించినా సాఫ్ట్వేర్ వెంటనే ఆ లావాదేవీని ఆపేస్తుంది. ఈ విధానం రియల్ ఎస్టేట్ మోసాలకు కూడా అడ్డుకట్ట వేస్తుంది.
ఒకే పత్రంలో మొత్తం ఆస్తి వివరాలు
ఈ సాఫ్ట్ వేర్ తో రియల్ ఎస్టేట్ వెంచర్ల లో రోడ్లు, పార్కులు వంటి మౌలిక సదుపాయాల కోసం కేటాయించాల్సిన స్థలాన్ని కూడా ప్లాట్లుగా అవి మార్చేస్తున్న దానికి చెక్ పెట్టొచ్చు. ఈ టైటిల్ విధానం అమలులోకి వస్తే భవిష్యత్తులో ఆస్తిపై ఎవరి పేరు మీద ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో ఆస్తి ఉందనే పూర్తి వివరాలు ఒకే పత్రంలో అందుబాటులో ఉంటాయి. దీనివల్ల నకిలీ కి చెక్ పడుతుంది.
లింక్ డాక్యుమెంట్స్ కూడా పక్కాగా, అక్రమాలకు చెక్
ఆస్తి వివాదాలు బాగా తగ్గుతాయి. ఇక ఈ కొత్త విధానంలో 1983 నుంచి ఉన్న ఈసీ వివరాలను కూడా అనుసంధానం చేస్తారు. దీనివల్ల ఆ ఆస్తి గత 40 ఏళ్లుగా ఎవరెవరి చేతులు మారింది లింక్ డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అన్న చరిత్రను కూడా స్పష్టం చేస్తుంది. ఏది ఏమైనా టెక్నాలజీ సహాయంతో ఖాళీ స్థలాలు, ఇళ్ల డబుల్ రిజిస్ట్రేషన్ కు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ -
తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications