సింగరేణి బొగ్గు గనిలో కూలిన పైకప్పు: ఒకరు మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గనిలో గురువారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. వకిల్‌పల్లి గనిలో పైకప్పు కూలడంతో ఓవర్‌మెన్ నవీన్ మృతి చెందాడు. మరో ముగ్గురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.
గనిలో మూడో సీమ్ 66 లెవల్ 44 డీప్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో ప్రమాద స్థలానికి దగ్గరలో పనిచేస్తున్న ఓవర్‌మెన్ గల్లంతయ్యాడు. రంగంలోకి దిగిన రెస్కూ బృందాలు నవీన్ మృతదేహాన్ని గుర్తించి బయటికి తీశాయి.

ఘటన సమయంలో అక్కడే ఎల్‌హెచ్‌డీ యంత్రంపై పనిచేస్తున్న ఆపరేటర్ వెంటనే అప్రమత్తమై ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు.
I am praying and hoping that our singareni brother Naveen who is currently trapped in the Vakeelpalli mine due to a mishap is rescued safely and swiftly @PRO_SCCL
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 29, 2020
కాగా, సింగరేని కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) అనేది ప్రభుత్వ రంగ బొగ్గు మైనింగ్ సంస్థ. ఇది తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం సంయుక్తంగా యాజమాన్యంలో ఉంది. ప్రస్తుతం, ఎస్‌సిసిఎల్ తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో 18 ఓపెన్‌కాస్ట్, 27 భూగర్భ బొగ్గు గనులను 48,000 మందికి సిబ్బందితో నిర్వహిస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications