హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీస్ పేరు చెప్తే పిల్లనివ్వట్లేదని రాజీనామా.. ఏడాది తిరగముందే ట్విస్ట్..

|
Google Oneindia TeluguNews

పోలీస్ అంటే చాలు.. ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రావట్లేదని ఓ కానిస్టేబుల్ గతేడాది తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కానీ ఏడాది తిరగకముందే.. అదే పోలీస్ మళ్లీ వచ్చి తన ఉద్యోగం తనకు ఇప్పించాలని కోరాడు. ఉద్యోగంపై మనసు మార్చుకున్నాడో లేక.. పెళ్లి పైనే మనసు మార్చుకున్నాడో తెలియదు కానీ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించడంతో తిరిగి అతను విధుల్లో చేరాడు. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

వలస కార్మికులను బూటు కాలితో తన్నిన పోలీస్..వలస కార్మికులను బూటు కాలితో తన్నిన పోలీస్..

అసలేం జరిగింది..

అసలేం జరిగింది..

విశాఖ జిల్లా కొత్తవలసకు చెందిన సిద్దాంతి ప్రతాప్ కుటుంబం చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. ఆయన తండ్రి ఈశ్వర్ రావు పాల వ్యాపారం చేస్తూ ప్రతాప్‌ను,ఇద్దరు కుమార్తెలను బాగా చదివించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ప్రతాప్.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై ఇష్టంతో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి.. కానిస్టేబుల్‌కి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మనస్తాపం చెంది ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

ప్రతాప్ రాజీనామా లేఖలో ఇలా..

ప్రతాప్ రాజీనామా లేఖలో ఇలా..

'సార్.. నేను చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాను. ఇంట్లో నాకోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.ఇటీవల పెళ్లిచూపులకు వెళ్లగా.. కానిస్టేబుల్ అని చెప్పగానే యువతి తిరస్కరించింది. కానిస్టేబుల్ అంటే 24గంటలు పని ఉంటుంది..ఈ సంబంధం వద్దని చెప్పేసింది. పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నవారికి సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రమోషన్స్ లభించడం లేదు. 20ఏళ్లు పనిచేసినా కానిస్టేబుల్,హెడ్ కానిస్టేబుల్‌గానే ఉండిపోవాల్సి వస్తోంది.ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్వీస్ ప్రకారం ప్రమోషన్స్ ఉంటే ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు.అందుకే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను' అని సిద్దాంతి ప్రతాప్ అప్పట్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు రాజీనామా లేఖ రాశారు.

Recommended Video

Allu Arju Responded David Warner's Ramulo Ramula Song Dance | Oneindia Telugu
మళ్లీ ఎందుకు చేరాడు..

మళ్లీ ఎందుకు చేరాడు..

కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాక ప్రతాప్ బిజినెస్ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఆ ప్రయత్నాల్లో ఉండగా పెళ్లి సంబంధాలు చూడగా.. అప్పుడు కూడా సెట్ అవలేదు. దీంతో విసుగు చెందిన ప్రతాప్.. అనవసరంగా ఉద్యోగం వదిలేశానని భావించాడు. ఉన్నతాధికారులను కలిసి తిరిగి తన ఉద్యోగం ఇప్పించాలని వినతిపత్రం అందజేశాడు. అధికారులు సానుకూలంగా స్పందించడంతో మళ్లీ అతనికి పోస్టింగ్ వచ్చింది. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ విభాగంలో డిప్యుటేషన్‌లో పనిచేస్తున్నాడు. ప్రతాప్ మనసు మార్చుకుని మళ్లీ ఉద్యోగంలో చేరటం సంతోషంగా ఉందని ఆయన తండ్రి ఈశ్వర్‌రావు తెలిపారు.

English summary
Siddanthi Pratap,A young police constable who was resigned for his post last year again joined in duties recently. As he was working as a constablewas rejected by somany girls to marry him.However,he changed his attitude and again joined in duty with the help of higher officials
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X