వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ప్రభావం ... జాబ్స్ టెన్షన్ .. పరేషాన్ లో ఐటీ ఉద్యోగులు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం అటు ఐటీ ఉద్యోగుల మీద తీవ్రంగా పడుతుంది . కొత్త ప్రాజెక్టులు లేక, పాత ప్రాజెక్టులు క్లియరెన్స్‌ కాక ఐటీ ఉద్యోగులకు వారి జాబ్స్ ఉంటాయా ఊడతాయా అన్న ఆందోళన నెలకొంది. వందలు వేలు కాదు ఏకంగా లక్షల్లో ఉద్యోగాలు పోతాయేమో అన్న ఆందోళన ఐటీ ఉద్యోగుల్లో నెలకొంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ ఐటీరంగంలో ఒక్కసారిగా కుదుపులకు కారణం అవుతుంది . హైదరాబాద్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు టెన్షన్ తెప్పిస్తుంది .

భాగ్యనగర్ ఐటీ ఉద్యోగులకు టెన్షన్ .. కరోనాతో తిప్పలు

భాగ్యనగర్ ఐటీ ఉద్యోగులకు టెన్షన్ .. కరోనాతో తిప్పలు

హైదరాబాద్ కేంద్రంగా గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, విప్రో, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు 20కి పైగా మల్టీనేషనల్‌ కంపెనీలు, 300కిపైగా బీపీఓలు, మరికొన్ని ఐటీయేతర కంపెనీలు ఉన్నాయి. ఇక వీటిలో 6 లక్షలకుపైగా ఐటీ ఉద్యోగాలున్నాయి. ఇక కరోనా వైరస్ తెలంగాణలో వ్యాప్తి చెందుతున్న సమయంలో మైండ్ స్పేస్ ఉద్యోగికి కరోనా అన్న ఫేక్ వార్త ప్రచారం కావటంతో కొన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ చెయ్యాలని ఉద్యోగులకు ఆదేశాలిచ్చాయి . లాక్‌డౌన్‌ అమలు నుంచి నేటి వరకు ప్రతీ కంపెనీ వర్క్‌ ఫ్రం హోమ్‌ కొనసాగిస్తూ వస్తున్నాయి. కానీ లాక్ డౌన్ ఎఫెక్ట్ ఏ వ్యాపార సంస్థలలోనూ సరిగ్గా కార్యాకలాపాలు సాగటం లేదు .

 కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్న సంస్థలు

కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్న సంస్థలు

దీంతో ఇప్పటికే పలు కంపెనీలు కాస్ట్‌ కటింగ్‌ పేరుతో ఉద్యోగాల్లో కోత మొదలుపెట్టాయి. వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రొవైడ్‌ చేయలేని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు పర్సనల్‌ ల్యాప్‌టాప్‌ ఇవ్వలేక, ఇంకా అనేక ఇబ్బందుల నేపధ్యంలో కంపెనీలను మూసేశాయి .ఉద్యోగులకు జీతాలివ్వలేక కొన్ని సంస్థలు రాత్రికి రాత్రే ఉద్యోగులను తొలగించాయి . ఇక తాజా పరిణామాల నేపధ్యంలో నిర్వహించిన సర్వేలో ఉద్యోగుల కోత తప్పదనే నివేదికలు బయటకు వచ్చాయి. 200 కంపెనీలకుపైగా సీఈఓలతో సీఐఐ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది .

కరోనా ప్రభావంతో ఐటీ కుదేలు .. ఉద్యోగులకు షాక్ ఇస్తున్న కంపెనీలు

కరోనా ప్రభావంతో ఐటీ కుదేలు .. ఉద్యోగులకు షాక్ ఇస్తున్న కంపెనీలు


అనేక రంగాల్లో ఉద్యోగాల్లో కోతలు తప్పవని 120 మందికి పైగా సీఈఓలు చెప్పినట్లు సర్వే నివేదిక చెప్తోంది. ఇక ఇప్పటికే కరోనా ప్రభావంతో అమెరికా సహా అన్ని దేశాల్లో కంపెనీలు మూతపడ్డాయని ఇకపై భారత్‌కు కొత్త ప్రాజెక్టులు ఉండకపోవచ్చని ఐటీ కంపెనీల సీఈవోలు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది . వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇచ్చిన పలు కంపెనీలు ఈ పదిరోజుల్లోనే చాలా మందికి టెర్మినేట్ చేస్తూ లెటర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్త ప్రాజెక్టులు లేవు కాబట్టి మీ ప్రాజెక్ట్‌ పూర్తికాగానే శాలరీ సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని చెప్తున్న పరిస్థితులు ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇకపై మీరు మా కంపెనీ ఉద్యోగి కాదని మెయిల్‌ చేస్తున్న తీరుతో ఉద్యోగులు షాక్ తింటున్నారు. తమ పరిస్థితి అర్ధం కాక దిగులు పడుతున్నారు.

English summary
The coronavirus effect can seriously affect IT employees. There were concerns that IT employees would have jobs if they had no new projects or clearance of old projects. IT employees are worried that thousands of jobs will be lost. The lock down effect causes a sudden jerk in the IT. Tension for employees working in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X