చిన్నారి రమ్య మృతి: బిటెక్ విద్యార్థికి పోలీసు కస్టడీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: చిన్నారి రమ్య మృతి కేసులో బిటెక్ విద్యార్థి శ్రావెల్‌ను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చిన్నారి రమ్య మృతికి, కారు ప్రమాదానికి కారణమై ఇంజినీరింగ్ విద్యార్థి శ్రావెల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దానిపై స్పందించిన కోర్టు శ్రావెల్‌ను రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ నాంపల్లి కోర్టు అనుమతించింది. రేపు మంగళవారంనాడు కస్టడీకి తీసుకొని ఈ నెల 14న కోర్టులో హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. కారు ప్రమాదంలో గాయపడిన రమ్య తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే.

Also Read: చిట్టితల్లి రమ్యకు చివరి ముద్దు: తల్లి కన్నీరుమున్నీరు(పిక్చర్స్)

బిటెక్ విద్యార్థి శ్రావెల్ నడిపిన కారు ప్రమాదానికి గురై మరో కారుపై పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన చిన్నారి రమ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

Court orders two days custody to BTech student

కాగా, రమ్య మృతికి నివాళులు అర్పిస్తూ సోమవారం సాయంత్రం హైదరాబాదులోని కెబిఆర్ పార్కు వద్ద కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా పాల్గొన్నారు. రమ్య తాత, ఇతర కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

కారు ప్రమాదానికి కారణమై, ఇద్దరి మృతికి బాధ్యుడైన బిటెక్ విద్యార్థి శ్రావెల్‌ను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రమ్య మృతికి నివాళులు అర్పిస్తూ హైదరాబాదులో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Court orders two days custody to BTech student
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి