వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్ హీరోస్: కేటీఆర్-సోనూసూద్ హాట్ డిబేట్: హైదరాబాద్‌లో కలుద్దామంటూ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా వైరస్ పెను సంక్షోభాన్ని మిగిల్చిన ప్రస్తుత పరిస్థితుల్లో దేశం మొత్తం బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వైపు చూపులు సారించింది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ.. స్వచ్ఛందంగా కరోనా బారిన పడిన వారిని ఆదుకుంటోన్నారు. ఈ సంక్లిష్ట సమయంలో పేదలు, అవసరం ఉన్నవారికి అండగా నిలుస్తోన్నారు. ఆపన్న హస్తాన్ని అందిస్తోన్నారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల నుంచి ఆహారం వరకూ అవసరమైన అన్ని వసతులను ఆయన కల్పిస్తోన్నారు. దీనికోసం ఇప్పటికే కోట్లాది రూపాయలను వ్యయం చేశారు. ఏడాదికాలంగా అడిగిన వారికి లేదనకుండా తనవంతు సహాయన్ని అందిస్తోన్నారు సోనూ.

Recommended Video

Sonu Sood A Superhero - KTR Tweets | Oneindia Telugu

ట్విట్టర్ ద్వారా సహాయం కోరే వారికీ

మరోవంక- తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం.. ట్విట్టర్ వేదికగా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యనూ తీర్చే ప్రయత్నం చేస్తోన్నారు. ఇబ్బందుల్లో ఉన్నామంటూ ట్వీట్ చేసిన వారికి భరోసా ఇస్తోన్నారు. వారి ట్వీట్లను తన అధికారిక కార్యాలయానికి రీట్వీట్ చేస్తోన్నారు. తక్షణమే స్పందించాలంటూ మంత్రి హోదాలో ఆదేశాలను జారీ చేస్తోన్నారు. జారీ చేయడంతో వదిలేయట్లేదు. అదెంత వరకు వచ్చిందనే విషయంపైనా ఎప్పటికప్పుడు ఆరా తీస్తోన్నారు. మంత్రిగా తీరిక లేకుండా గడుపుతోన్నప్పటికీ- ట్వీట్టర్ ద్వారా సహాయం కోరిన వారిని కాదనట్లేదు.

సోనూ సూద్‌ను సూపర్ హీరోగా..

ఈ క్రమంలో నందకిశోర్ అనే వ్యక్తి చేసిన ట్వీట్‌కు కేటీఆర్ యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. తన స్నేహితుడి తండ్రి ముజాహిద్ అలీకి అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమైదంటూ ఆయన చేసిన ట్వీట్ కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన అందేలా చేశారు. దీనికి ప్రతిగా నందకిశోర్..కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఆయనను హీరోగా అభివర్ణించారు. దానికి మళ్లీ కేటీఆర్ బదులిచ్చారు. తాను ప్రజలు ఎన్నుకొన్న నాయకుడిని మాత్రమేనని, ఆ బాధ్యతతో తాను సహాయం చేస్తోన్నానని అన్నారు. ఈ కష్ట సమయంలో స్వచ్ఛందంగా ప్రజలను ఆదుకుంటోన్న సోనూ సూద్‌ సూపర్ హీరో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దాన్ని సోనూ సూద్‌కు ట్యాగ్ చేశారు.

కోట్లాదిమందికి స్ఫూర్తి

అనుకోని విధంగా కేటీఆర్ నుంచి వచ్చిన ఈ ప్రశంస పట్ల సోనూ సూద్ ఆశ్చర్యపోయారు. ఆయనకు రిప్లై ఇచ్చారు. తెలంగాణ కోసం ఎంతో చేస్తోన్న కేటీఆర్ నిజమైన హీరో అని కితాబిచ్చారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. తెలంగాణను తాను రెండో పుట్టినిల్లుగా భావిస్తానని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలను తనను ప్రేమిస్తున్నారని భావోద్వేగంతో బదులిచ్చారు. దీనిపై మళ్లీ కేటీఆర్ సోనూకు ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కోట్లాదిమంది ప్రజలకు స్ఫూర్తి నింపుతున్నారని, ఈ పనులను కొనసాగించాలని కోరారు.

హైదరాబాద్‌లో కలుద్దామంటూ..

తన మిషన్‌ను కొనసాగిస్తూనే ఉంటానని, ఈ సారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కొంత సమయమిస్తే కలుస్తానని విజ్ఞప్తి చేశారు సోనూ సూద్. తప్పకుండా కలుద్దామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ఇద్దరి డిబేట్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేటీఆర్, సోనూసూద్‌లను వారి అభిమానులు, నెటిజన్లు సూపర్ హీరోలుగా అభివర్ణిస్తూ ట్వీట్లు చేస్తోన్నారు. యువతరానికి, యంగ్ ఇండియా కేటీఆర్, సోనూసూద్ ప్రతినిధులుగా కనిపిస్తున్నారని చెబుతోన్నారు. ఇలాంటి యువ నేతల చేతుల్లో దేశ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందని వ్యాఖ్యానిస్తోన్నారు.

English summary
Interesting talk between Telangana Minister KTR and Sonu Sood on Coronavirus helping each other. KTR calls Sonu Sood as a Super Hero.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X