వాట్సాప్ లో కొత్త మోసం.. జాగ్రత్త: సీపీ సజ్జనార్ వార్నింగ్
ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులో వాట్సాప్ రోజువారీ జీవితంలో తప్పనిసరిగా మారిపోయాయి. మారిన టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త దారిని ఎంచుకుంటున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం వాట్సాప్ ను దోపిడీకి వినియోగించుకుంటున్నారు. వాట్సాప్ యూజర్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి ఫోన్లలోకి చొరబడి అకౌంట్‌ను హ్యాక్ చేస్తున్నారు. అందులోని సమాచారం ఆధారంగా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే పెరిగిన సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని సీపీ సజ్జనార్ కీలక వార్నింగ్ ఇచ్చారు.
వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలు, అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త Whatsapp Impersonation Fraud కు తెరలేపారని తెలిపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్ కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లలోకి మాల్వేర్ను ప్రవేశపెట్టి, తద్వారా సిస్టమ్స్‌పై పూర్తి స్థాయి రిమోట్ యాక్సెస్‌ను పొందుతున్నారని సీపీ సజ్జనార్ వివరించారు.
సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత, అందులో యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను ఉపయోగించి సీఈఓ లేదా సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తున్నారని సీపీ సజ్జనార్ అన్నారు. తాను అత్యవసర సమావేశంలో ఉన్నానని, ఫోన్ ఎత్తడం వీలుపడదని నమ్మబలుకుతూ, సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో కోట్లాది రూపాయలను తక్షణమే సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలకు బదిలీ చేయించుకుంటున్నారని సీపీ సజ్జనార్ వివరించారు.
"వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓల ఫోన్ నంబర్ల నుంచే అకౌంటెంట్లను సందేశాలు వస్తుండటంతో నిజమేనని డబ్బును పంపుతున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, ప్రతి కంపెనీ కూడా అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్‌లో పై అధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదు. వెంటనే వారికి నేరుగా ఫోన్ చేసి ఆ మెసేజ్ నిజమేనా కాదా అని ధృవీకరించుకోవాలి" అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

"ఆఫీసు సిస్టమ్స్‌లో నాణ్యమైన ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసి ఉంచండి. అలాగే వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి" అని సీపీ సజ్జనార్ సూచనలు చేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications