ప్రాణం తీసిన యాపిల్: డిగ్రీ విద్యార్థిని మృతి..
కొలనూర్‌కు చెందిన ఏడుమ్యాకల ఝాన్సీ(19) అనే డిగ్రీ విద్యార్థిని యాపిల్ తింటూ మరణించింది.
ఓదెల: తినే ఆహారం గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇదివరకు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కొలనూరులోను ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కొలనూర్‌కు చెందిన ఏడుమ్యాకల ఝాన్సీ(19) అనే డిగ్రీ విద్యార్థిని ఉదయం ఇంట్లో యాపిల్ తింటుండగా అది గొంతుకు అడ్డంపడింది. దీంతో తీవ్ర నొప్పితో విలవిల్లాడిపోయింది. బాధితురాలిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే మృతిచెందింది. దీంతో ఝాన్సీ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications