హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లు: ఆరుగురిని దోషులుగా తేల్చిన కోర్టు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థపై నేరారోపణ రుజువైంది. దీంతో ఆరుగురు నిందితులను దోషులుగా తేల్చడం జరిగింది.

ఆరుగురు దోషులల్లో ప్రధాన దోషి రియాజ్ భత్కల్ పరారీలో ఉండటంతో మిగితా దోషుల శిక్ష ఖరారును సోమవారాని(డిసెంబర్ 19)కి వాయిదా వేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఎన్ఐఏ బలమైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడంతో దోషులను తేల్చింది కోర్టు. ఇప్పటి వరకు 157మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.

Dilsukhnagar twin blasts: five accused guilty

కాగా, 2013, ఫిబ్రవరి 21న జరిగిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లలో 19 మంది మృతి చెందగా, 131మందికి గాయాలయ్యాయి. ఐదుగురు నిందితులు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తుండగా, పేలుళ్లకు ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు.

దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: పోలీసు ప్రయత్నాలుదిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: పోలీసు ప్రయత్నాలు

దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: జుమేరాత్ బజార్‌ సైకిళ్లు?దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: జుమేరాత్ బజార్‌ సైకిళ్లు?

దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: ఇక్కడ పుట్టి, అక్కడికి వెళ్లి..?దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: ఇక్కడ పుట్టి, అక్కడికి వెళ్లి..?

పేలుళ్లు: భత్కల్‌, మరో 9 మందిపై అరెస్టు వారంట్పేలుళ్లు: భత్కల్‌, మరో 9 మందిపై అరెస్టు వారంట్

దిల్‌షుక్‌నగర్ కేసు: బాంబులు పేల్చింది ఆ ఇద్దరేదిల్‌షుక్‌నగర్ కేసు: బాంబులు పేల్చింది ఆ ఇద్దరే

దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: రూం నెంబర్ 303 మిస్టరీదిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: రూం నెంబర్ 303 మిస్టరీ

పేలుళ్లు: బాంబు తయారీకి అమ్మోనియం నైట్రేట్ వాడారుపేలుళ్లు: బాంబు తయారీకి అమ్మోనియం నైట్రేట్ వాడారు

ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మూడున్నరేళ్లుగా కేసు విచారణ జరిపింది. మొత్తం 157మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి... ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించింది. 502 దస్త్రాలను, 201 వస్తువులను సాక్ష్యాలుగా పరిశీలించింది. సరూర్‌నగర్‌, మలక్‌పేట పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది.

ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్‌ భత్కల్‌ ప్రధాన సూత్రధారిగా నిర్ధరించింది. అసదుల్లా అక్తర్‌ వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌లు ప్రత్యక్షంగా సైకిళ్లపై బాంబులు పెట్టి పేల్చినట్లు ఎన్‌ఏఐ ఆధారాలు సేకరించింది. యాసిన్‌ భత్కల్‌, ఐజాజ్‌ షేక్‌లు కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఐఏ స్పష్టం చేసింది.

వకాస్‌ పాకిస్థాన్‌ జాతీయుడు కాగా.. మిగిలినవారు కర్ణాటక, బీహార్‌, యూపీకి చెందిన వారు. అసదుల్లా అక్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌, యాసిన్‌ భత్కల్‌, ఐజాజ్‌షేక్‌లు చర్లపల్లి జైల్లో ఉండగా.. రియాజ్‌ భత్కల్‌ పరారీలో ఉన్నాడు. కాగా, రియాజ్‌ పాకిస్థాన్‌లో ఉండొచ్చని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది.

English summary
NIA court released it's verdict on Dilsukhnagar twin blasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X