వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివక్షలో స్పెషాలిటీ: నిధుల ఊసే లేని ‘ఎయిమ్స్’.. తెలంగాణపై ఒకలా? హిమాచల్‌లో లక్ష్యాల నిర్దేశం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: 'కడబంతిలో ఉన్నా కావల్సిన వారికి వడ్డింపు బాగానే ఉంటుంది' అన్నది ఒక సామెత. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ పక్షపాతం అలాగే ఉన్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ప్రస్తుత ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌లో అదీ టీఆర్ఎస్ ఎంపీలంతా నిలబడి నిరసన తెలిపితే గానీ తెలంగాణకు ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేయలేదు.
తెలంగాణకు ఎయిమ్స్‌ మంజూరుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌లో ప్రకటన చేసి ఏడాది కావస్తున్నా ఇంత వరకు నిధులు విడుదల కాలేదు.కానీ తర్వాతైనా సానుకూలంగా వ్యవహరిస్తున్నదా? అంటే అదీ లేదు.

 హిమాచల్‌లో ‘ఎయిమ్స్'కు నిధుల విడుదల ఇలా

హిమాచల్‌లో ‘ఎయిమ్స్'కు నిధుల విడుదల ఇలా

ఎయిమ్స్ ఏర్పాటుకు నిధుల విడుదల, అనుమతుల మంజూరు విషయమై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎన్నిసార్లు కేంద్రాన్ని అభ్యర్థించినా పట్టించుకోలేదు. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేసే విషయంలో కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శ వినిపిస్తున్నది. హిమాచల్ ప్రదేశ్‌లో ఎయిమ్స్ మంజూరు చేయడంతోపాటు నిధులు కేటాయింపు, లక్ష్యాల నిర్దేశం వెంటవెంటనే జరిగిపోయాయి. తాము అధికారంలో ఉన్నచోట ఒకలా? మిగతా చోట్ల మరొకలా? వ్యవహరిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి.

 బీజేపీ గెలుపుతోపాటు హిమాచల్ వాసి ‘జేపీ నడ్డా'

బీజేపీ గెలుపుతోపాటు హిమాచల్ వాసి ‘జేపీ నడ్డా'

హిమాచల్‌ప్రదేశ్‌ ఎయిమ్స్‌ విషయంలో మాత్రం కేంద్రం ఆగమేఘాల మీద ఆమోదం తెలిపి నిధుల విడుదలపై స్పష్టతనిస్తూ నిర్మాణం పూర్తికి లక్ష్యాన్ని కూడా నిర్దేశించింది. గత బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌లోని బిలాస్‌పూర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి వర్గం రూ. 1,350 కోట్ల నిధులు విడుదల చేసేందుకు అంగీకరించింది. అంతేకాదు 48 నెలల్లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడానికి తోడు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఇదే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడ ఎయిమ్స్‌ ఏర్పాటులో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని టీఆర్‌ఎస్‌ వర్గాల కథనం. వాస్తవ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి.

 ఎయిమ్స్‌పై కేంద్రంలో కొరవడిన సానుకూల స్పందన

ఎయిమ్స్‌పై కేంద్రంలో కొరవడిన సానుకూల స్పందన

తెలంగాణకు వచ్చేసరికి ఎయిమ్స్‌కు నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తోందని గులాబీ నేతలు అంటున్నారు. బీబీ నగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటుకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అభ్యర్థనలు చేసినా కేంద్రం స్పందించలేదు. తాజాగా తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు తగిన నిధులు కేటాయించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు తెరాస ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ విజ్ఞప్తి చేశారు. శుక్రవారమిక్కడ కేంద్రమంత్రి జేపీ నడ్డాతో మరోసారి నర్సయ్యగౌడ్‌ సమావేశమయ్యారు. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ కూడా పలుసార్లు నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 తెలంగాణకు సరేనన్న మంత్రి శాఖే మారిపోయిందిలా

తెలంగాణకు సరేనన్న మంత్రి శాఖే మారిపోయిందిలా

2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో ‘ఎయిమ్స్' ఏర్పాటుకు ఆగమేఘాలపై ప్రకటనలు చేసింది కేంద్రం. అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ను కలిసి తమకు కూడా ‘ఎయిమ్స్'ను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. అందుకు ఆయన సరేనన్నారు. కానీ తర్వాతీ కాలంలో జరిగిన క్యాబినెట్ విస్తరణలో ఆయన శాఖే మారిపోయింది. వరుసగా రెండు బడ్జెట్లు దాటిపోయాయి. కానీ తెలంగాణలో ‘ఎయిమ్స్' ఏర్పాటు చేయాలన్న విషయమై కేంద్ర ప్రభుత్వం కరుణ ప్రదర్శించలేదు.

 కీలక సమయాల్లో కేంద్రానికి టీఆర్ఎస్ ఇలా మద్దతు

కీలక సమయాల్లో కేంద్రానికి టీఆర్ఎస్ ఇలా మద్దతు

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గతేడాది బడ్జెట్ సమావేశాల్లో ఎయిమ్స్ ఏర్పాటుతోపాటు విభజన హామీల అమలు కోసం తీవ్ర నిరసన తెలియజేస్తే.. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చకు సమాధానమిస్తూ మంత్రి అరుణ్ జైట్లీ ‘ఎయిమ్స్' ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారే తప్ప.. తెలంగాణ పట్ల ప్రేమ, కరుణ చూపిన దాఖలాలు లేవు. నిధుల కేటాయింపైనా, పథకాల అమలైనా.. విద్యాసంస్థల ఏర్పాటు విషయమైనా తొలి నుంచి వివక్ష కనిపిస్తూనే ఉన్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కీలక సమయాల్లో మాత్రం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మద్దతునిస్తూనే ఉండటం ఆసక్తికర పరిణామం.

English summary
After Three and Half years discrimination continued on Telangana from Union Government. In 2017 - 18 finance minister Arun Jaitley assured that union government will establish 'AIIMS' in Telangana. Since there is no devolopment on this. But last Union Cabinet cleared AIIMS in Himachal Pradesh and Rs.1350 Crores sanctioned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X