హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భూప్రకంపనలు: కానీ!, అధికారులు ఏం చెప్పారంటే..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్, దుర్గం చెరువు, పెద్దమ్మగుడి ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు చెబుతున్నారు.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 0.5గా నమోదైనట్టు ఎన్జీఆర్ఐ అధికారులు తెలిపారు. ఇదేమంత తీవ్రమైనది కాదని, దీనివల్ల భయపడాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. కేబీఆర్ పార్కు ప్రదేశంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

earthquake in jubilee hills hyderabad

కాగా, భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉండటంతో ఈ విషయం కూడా ఎవరూ గమనించలేకపోయారని తెలుస్తోంది. కొంతమంది స్థానికులు మాత్రం గుర్తించారని అంటున్నారు. భూప్రకంపనలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్టు చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rumours spread about earthquake in Jubileehills Hyderabad. It's a very minor earthquake

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి