వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలో చేరిక వార్తలను ఖండించిన సినీనటి జయసుధ.. ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి జయసుధ బిజెపిలో చేరుతారని, తాజాగా ఆమెతో బిజెపి నేతలు జరిపిన సంప్రదింపుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయశాంతి కి పోటీ గా పార్టీలోకి జయసుధ ఎంట్రీ ఖాయమని చర్చ జరుగుతున్న తరుణంలో,సినీ నటి జయసుధ ఆగస్ట్ 21న బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు.

ఏ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదన్న జయసుధ

ఏ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదన్న జయసుధ

ఏ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. తాను ఈ నెల 21వ తేదీన బీజేపీలో చేరడం లేదని ఆమె చెప్పారు. అయితే, జయసుధ కొన్ని డిమాండ్లను పార్టీ జాతీయ నాయకత్వం ముందు ఉంచారని, తన డిమాండ్లు నెరవేరితే బీజేపీలో చేరతానని చెప్పారని బీజేపీలోని అత్యంత సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాషాయ పార్టీలో చేరే ప్రతిపాదనకు ఆమె అంగీకరించాలని భావిస్తే, తన డిమాండ్ల విషయంలో ఢిల్లీ నాయకుల నుండి హామీ పొందాలని ఆమె వారికి చెప్పారు.

ఇప్పటికే అనేక పార్టీలు మారిన జయసుధ రాజకీయ ప్రస్తానం

ఇప్పటికే అనేక పార్టీలు మారిన జయసుధ రాజకీయ ప్రస్తానం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జయసుధ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. 2016లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే, ఆ తర్వాత ఆమె టీడీపీని వీడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీలో చేరారు.

Recommended Video

కుప్పకూలిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం *Politics | Telugu OneIndia
ఆగస్ట్ 21న పార్టీలో చేరాలని బీజేపీ ఆహ్వానం

ఆగస్ట్ 21న పార్టీలో చేరాలని బీజేపీ ఆహ్వానం

టాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు జయసుధ త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జయసుధ బిజెపి చేరికల కమిటీ కన్వీనర్ మరియు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో చర్చలు జరిపారు. ఆయన జయసుధను ఆగస్టు 21న బిజెపిలో చేరమని ఆహ్వానించినట్లు భావిస్తున్నారు. ఈటల రాజేందర్‌తో భేటీ తర్వాత జయసుధ బిజెపిలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.

బీజేపీ అధిష్టానం జయసుధ డిమాండ్ లకు ఓకే అంటే రంగంలోకి జయసుధ

బీజేపీ అధిష్టానం జయసుధ డిమాండ్ లకు ఓకే అంటే రంగంలోకి జయసుధ

జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచి 2014 ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2014 ఓటమి తర్వాత ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. కానీ ఆమె అదేమీ లేదని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ బిజెపి ముందు జయసుధ ఉంచిన డిమాండ్లకు అధిష్టానం ఓకే అంటే తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు జయసుధ రంగంలోకి దిగుతారని విశ్వసనీయ సమాచారం.

English summary
Denying the news of joining the BJP, film actor, politician Jayasudha made it clear that she has no intention of contesting any election. She said that she is not joining BJP on August 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X