కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగుపై పారిస్ వ్యక్తి ఆసక్తి: రెండున్నరేళ్లలో నేర్చుకొని అక్కడ చెప్తున్నారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: తెలుగు భాష పైన మమకారంతో పారిస్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఆసక్తిగా తెలుగు నేర్చుకొని మాట్లాడుతున్నారు. ఇది అందర్నీ కట్టిపడేసింది. ఆదివారం కరీంనగర్ జిల్లాలో జరిగిన తెలంగాణ రచయితల వేదిక 4వ మహాసభల్లో పారిస్‌కు చెందిన డానియల్ నెజెర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అతను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వచ్చి, ఇద్దరు గురువుల వద్ద రెండున్నర ఏళ్లు తెలుగు నేర్చుకున్నారట. 2012 నుంచి తెలుగు భాష పైన కృషి చేస్తూ అనువాదాలు చేస్తున్నారట. తెలుగు సాహిత్యాన్ని అనువదించ పారిస్‌లో చెబుతున్నారు.

Foreigner interest on telugu literature

చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్తు: కోదండరామ్

గత చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్తుకు ప్రణాళికలు వేయగలమని తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. చదువుకున్నవాళ్లు మౌనంగా ఉండటం పెద్ద నేరం అన్నారు. తెలంగాణ చరిత్రను తిరిగిరాస్తేనే భవిష్యత్తుకు దారి దొరుకుతుందన్నారు.

ప్రభుత్వం ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయడం వల్ల పెట్టుబడిదారులే బలపడుతున్నారన్నారు. సామాన్యుడికి వైద్యం అందించే పరిస్థితుల్లో ఆసుపత్రులు లేవన్నారు. అందుకు నిదర్శనం ఉస్మానియా ఆసుపత్రేనని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Foreigner interest on telugu literature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X