వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ పాదయాత్రలో అపశృతి, కిందపడిపోయిన గీతా రెడ్డి

|
Google Oneindia TeluguNews

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో ఆయనతో కాంగ్రెస్ నేత గీతా రెడ్డి కూడా నడిచారు. అయితే పాదయాత్రలో అపశృతి జరిగింది. గీతారెడ్డి గాయపడ్డారు. రోడ్డుపై పడిపోవడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. వెంటనే కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు.సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఒక్కసారిగి సిచుయేషన్ మారింది. ఆ తర్వాత రాహుల్ పాదయాత్ర కొనసాగింది.

నిన్న కూడా రాహుల్ గాంధీ పాదయాత్రలో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. పాదయాత్రలో తోపులాట జరగ్గా, మహారాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రౌత్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో గల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలు అందరూ పరామర్శించారు.

geetha reddy fallen in the rahul padayatra

ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ప్రధాని మోడీ నల్లధనం తెస్తానని నోట్ల రద్దు చేశారని.. దీంతో జనాలకు ఇబ్బంది కలిగిందని చెప్పారు. దాదాపు 150కి పైగా సామాన్య జనం చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ఇంజినీరింగ్ చేసి డ్రైవింగ్ చేస్తున్నారని.. యువతకు ఉపాధి ఏదీ అని అడిగారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. రాష్ట్రంలో భూములు ఎక్కడికి పోయాయని అడిగారు. ధరణి పోర్టల్ వల్ల జనాలకు మేలు జరగడం లేదని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏమీ చేయడం లేదన్నారు.

English summary
congress leader geetha reddy fallen in the rahul gandhi padayatra. she admitted hospital, now stable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X