మోడీని గడగడ.. ‘పప్పు’ కాదు: కేటీఆర్‌పై గీత ఫైర్, ‘అంతా లోఫర్లే-కేటీఆర్ తక్కువేం కాదు’

Subscribe to Oneindia Telugu
  Revanth Reddy Strong Counter to KTR over 'Loafer' Comment

  హైదరాబాద్: అదో లోఫర్ పార్టీ అంటూ తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేతలు గీతారెడ్డి, జీవన్ రెడ్డిలో మంత్రి కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  విదేశాల్లో ఉన్నత విద్య చదువుకున్న మంత్రి ఇలా మాట్లాడటం భావ్యమేనా? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.. సోనియా గాంధీ దగ్గర మోకరిల్లారని.. అందులో మీ పిల్లలు కూడా ఉన్నారని అన్నారు.

  రాహుల్ పప్పు కాదు..

  రాహుల్ పప్పు కాదు..

  ఆ రోజు రాహుల్ గాంధీ పప్పు అనిపించే అక్కడికెళ్లారా? అంటూ గీతారెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు గానీ, ఇతర టీఆర్ఎస్ నేతలకు గానీ లేదని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు పప్పు కాదని, గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీనే గడగడలాడించారని చెప్పుకొచ్చారు.

  అంతా ఏకం కావాల్సిందే: 2019లో మోడీని ఎదుర్కొనేందుకు సోనియా బిగ్ ప్లాన్

  మోడీకి లొంగిన కేసీఆర్

  మోడీకి లొంగిన కేసీఆర్

  మరో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోడీ అవమానిస్తే టీఆర్ఎస్ ఎంపీలు నోటికి బట్టలు కట్టుకొని కూర్చున్నారంటూ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మోడీకి లొంగిపోయిందని, సీబీఐ కేసులకు భయపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.

  జై ఆంధ్రాగా కేసీఆర్ నినాదం

  జై ఆంధ్రాగా కేసీఆర్ నినాదం

  కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోయినా, అన్యాయం జరిగినా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. జై తెలంగాణ నుంచి జై ఆంధ్రాగా.. కేసీఆర్ వైఖరి మారిందని దుయ్యబట్టారు.

  అన్నంత పనీ చేసిన రేణుక: కిరణ్ ‘శూర్పణఖ'పై ప్రివిలేజ్ నోటీసు, అసలేం జరిగిందంటే?

  కేటీఆర్ స్థాయి సిరిసిల్లా నుంచి సిలికాన్ వ్యాలీ దాకా

  కేటీఆర్ స్థాయి సిరిసిల్లా నుంచి సిలికాన్ వ్యాలీ దాకా

  కాగా, టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు పూనకం వచ్చినట్లు కేటీఆర్‌ను తిడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను తిట్టలేదా? అని ప్రశ్నించారు. కేటీఆర్ స్థాయి రాహుల్, ఉత్తమ్ కుమార్ రెడ్డిల కన్నా చిన్నదేం కాదని అన్నారు. సిరిసిల్లా నుంచి సిలికాన్ వ్యాలీ దాకా కేటీఆర్‌కు ఓ స్థాయి ఉందని అన్నారు. మిషన్ భగీరథ నీళ్లతో మహిళల్లో ఆనంద భాష్పాలు కనిపిస్తుంటే.. కాంగ్రెస్ నేతలకు మాత్రం కన్నీటిధారగా కనబడుతోందని ఎద్దేవా చేశారు.

  అంతా లోఫర్లే

  అంతా లోఫర్లే

  మంత్రి కేటీఆర్ వాస్తవాలే మాట్లాడుతున్నారని, అందుకే కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులంతా లోఫర్లేనని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ బాహుబలి అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ చోర్ బ్యాచ్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హెచ్చరించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress leaders Geetha Reddy and Jeevan Reddy on Friday fired at Telangana minister KT Rama Rao for his comments on congress.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి