హడలెత్తిస్తున్న కోతి.. 90మందిపై దాడి.. వేట షురూ

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : ఓ మతిస్థిమితం లేని కోతి కొద్దిరోజులుగా సైదాబాద్ పరిధిలో నానా భీభత్సం సృష్టిస్తోంది. కోతి బెడద తట్టుకోలేక సత్యవతి అనే గృహిణి ఏకంగా చెన్నైలోని తమ అబ్బాయి ఇంటికి వెళ్లిపోయిందంటే.. స్థానికుల్లో కోతి భయం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జీహెచ్ఎంసీ ఎలాగైనా సరే.. ఆ కోతిని బంధించాలని రంగంలోకి దిగింది. ఇందుకోసం ఓ మోస్తరు భారీ ఆపరేషన్‌నే చేపడుతోంది. గ్రేటర్ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు కోతిని పట్టుకోవడానికి వెటర్నరీ, మునిసిపల్, జూపార్క్ సిబ్బంది బుధవారం నాడు రంగంలోకి దిగారు.

GHMC workers started monkey hunting

సైదాబాద్ ప్రాంతంలో మతిస్థిమితం లేని కోతి దాడి వల్ల ఇప్పటివరకు 90మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఇళ్లలోకి దూరి మహిళలను భయపెడుతుండడంతో.. స్థానికుల్లో కోతి ఆందోళన ఎక్కువైంది. సైదాబాద్ కార్పోరేటర్ స్వర్ణలత విజ్ఞప్తి మేరకు స్పందించింన కమిషనర్ జనార్దన్ రెడ్డి.. తక్షణ చర్యలకు ఆదేశించడంతో ప్రస్తుతం కోతి కోసం భారీ వేట కొనసాగుతోంది. కోతిని తక్షణమే బంధించేలా చర్యలు చేపడుతామని స్థానికులు ఆందోళన చెందవద్దని కమిషనర్ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Residents of Saidabad are living in terror as monkeys are making them look over their shoulders, fearing for safety . As it turns out, as many as 80 people have been injured in around a fortnight on account of the monkey menace in the area.
Please Wait while comments are loading...