వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నత విద్యలో తెలంగాణ భేష్ ఓవరాల్ ర్యాంకింగ్‌లో హెచ్‌సీయూకి 11 ప్లేస్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉత్తమ విద్యాసంస్థల్లో తెలంగాణకు ర్యాంకుల పంట పడింది. జాతీయస్థాయిలో మంచి ర్యాంకులు సంపాదించాయి. రాష్ట్రంలో ఉన్న సెంట్రల్, స్టేట్ యూనివర్సిటీలో ఈసారి తమ స్థానాలు మెరుగుపర్చుకున్నాయి. ఓవరాల్ కేటగిరీలో 4 ర్యాంకులు సాధించిన తెలంగాణ.. ఇంజనీరింగ్ కేటగిరీ, యూనివర్సిటీల్లో టాప్ ర్యాంకులు కొట్టేసింది.

<strong>భారత నేవీలో ఛార్జ్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల</strong>భారత నేవీలో ఛార్జ్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఓవరాల్ కేటగిరీలో నాలుగు

ఓవరాల్ కేటగిరీలో నాలుగు

కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఓవరాల్ కేటగిరీలో టాప్ 100 ఇన్‌స్టిట్యూషన్స్‌లో తెలంగాణకు చెందిన నాలుగు విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. కేంద్ర విద్యాసంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈసారి 61.85 పాయింట్లతో 11వ ర్యాంకు సొంతం చేసుకుంది. గతేడాది 26వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఐఐటీ ఈసారి ఆ ర్యాంకును కాపాడుకుంది. ఇక 2018లో 45వ ర్యాంకుకు పరిమితమైన ఉస్మానియా యూనివర్సిటీ ఈసారి 49.86 పాయింట్లు సాధించి 43వ ర్యాంకుకు ఎగబాకింది. 46.06 పాయింట్లతో వరంగల్ నిట్ 61వ ర్యాంకు కైవసం చేసుకుంది. 101 నుంచి 150 ర్యాంకుల లిస్టులో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు చోటు సంపాదించుకున్నాయి.

ఇంజనీరింగ్‌లో

ఇంజనీరింగ్‌లో

ఇంజనీరింగ్ కాలేజీల కేటగిరీలో ఈసారి ఐఐటీ హైదరాబాద్‌కు 8వ స్థానం దక్కగా... వరంగల్ ఎన్ఐటీకి 26వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ 39, జేఎన్‌టీయూ హైదరాబాద్‌ 45, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ 83వ ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. తెలంగాణలోని పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు 101 నుంచి 200 మధ్య ర్యాంకులు దక్కాయి.

వర్సిటీ ర్యాంకింగ్స్‌లో

వర్సిటీ ర్యాంకింగ్స్‌లో

యూనివర్సిటీ కేటగిరీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఫోర్త్ ప్లేస్ కొట్టేసింది. ఉస్మానియా యూనివర్సిటీ 26వ స్థానంలో నిలవగా.. అగ్రికల్చర్ యూనివర్సిటీకి 79, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీక 82వ స్థానం లభించాయి. 101 - 150 లిస్టులో ఇఫ్ల్లూ, 151 నుంచి 200వ స్థానంలో కాకతీయ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ యూనివర్సిటీలు నిలిచాయి.

డిగ్రీ కాలేజీల్లో

డిగ్రీ కాలేజీల్లో

డిగ్రీ కాలేజీల కేటగిరీలో తొలిసారి హైదరాబాద్‌కు చెందిన కళాశాలకు స్థానం దక్కింది. ఈసారి సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్‌కు 95వ ర్యాంకు దక్కింది. మేనేజ్‌మెంట్ విభాగంగా ఇక్ఫాయ్ 26, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీకి 67వ స్థానంలో నిలిచాయి. ఇక ఫార్మసీ విభాగంలో నైపర్ 6వ ర్యాంకు సాధించగా.. సుల్తాన్ ఉల్ ఉలూమ్ 65వ ర్యాంకు కొట్టేసింది. న్యాయ విద్య విభాగంలో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ మూడో స్థానం పొందింది.

ఏపీలో మూడు వర్సిటీలు

ఏపీలో మూడు వర్సిటీలు

ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలతో పాటు కేఎల్ యూనివర్సిటీలు తమ ర్యాంకింగ్ మెరుగుపర్చుకున్నాయి. 2018లో ఆంధ్రా వర్సిటీకి 22వ ర్యాంకు రాగా.. ఈసారి 16వ స్థానానికి ఎగబాకింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 48వ ర్యాంకు సొంతం చేసుకుంది.

English summary
Several Central and State Higher Educational Institutions have improved their performance in overall category as well as rankings in the engineering and other streams in the National Institutional Ranking Framework 2019 rankings announced on Monday by President Ramnath Kovid. university of Hyderabad has got 11 positions with 61.85 points among the 100 top institutions in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X