పరువు హత్య.. పార్ట్‌నర్ కమ్ అల్లుడిని మట్టుబెట్టిన మామ.. రూ.10 లక్షలు లతీఫ్ గ్యాంగ్‌కు
వారిద్దరూ పార్ట్‌నర్స్.. రియల్ లావాదేవీలు బానే చేశారు. కానీ ఆ మాజీ హోం గార్డు కన్ను ఆయన కూతురిపై పడింది. కానీ ఆమె కూడా ఇష్టపడింది. దీంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. కానీ ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. సుపారీ గ్యాంగ్ పిలిచి మరీ పాత పార్ట్‌నర్ కమ్ అల్లుడిని మట్టుబెట్టించాడు. దీని వెనక రియల్ లావాదేవీలు కూడా ఉన్నాయని సందేహాం ఉంది. పూర్తి విచారణ తర్వాత ఏం జరిగిందనే అంశంపై క్లారిటీ రానుంది.

అదీ రామకృష్ణ గౌడ్
సిద్ధిపేట జిల్లా లకుడారంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద పాతిపెట్టిన రామకృష్ణ గౌడ్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఇప్పటివరకు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి వెంకటేష్‌గా గుర్తించారు. రామకృష్ణ మృతదేహంపై గాయాలు ఉన్నాయని క్లూస్ టీం గుర్తించారు. ఘటనా స్ధలం నుంచి ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నారు.

నెలరోజుల నుంచి ట్రాప్
లతీఫ్ గ్యాంగ్ రామకృష్ణను గత నెలరోజులుగా ట్రాప్ చేస్తోంది. కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో రామకృష్ణను మట్టుబెట్టాలని అతని మామ వెంకటేశ్ అనుకున్నాడు. నెలరోజులుగా రామకృష్ణను లతీఫ్ ట్రాప్ చేశాడు. దుబాయ్ నుంచి వచ్చానని, స్థలం కావాలని నమ్మించాడు. 5 వేలు డబ్బు కూడా ట్రాన్స్‌ఫర్ చేశాడు. రెండ్రోజుల క్రితం రామకృష్ణను జిమ్మాపూర్ సర్పంచ్ అమృతరావు ఇంటినుంచి పిలుచుకుని వెళ్లాడు. ఆ తర్వాత రామకృష్ణ ఇంటికి రాలేదు.

సర్పంచ్
రామకృష్ణ భార్య భార్గవి అమృతరావుకు ఫోన్ చేసింది. తనకేం తెలియదని చెప్పాడు. దీంతో భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామకృష్ణను నమ్మించి మోత్కూరు తీసుకెళ్లిన లతీఫ్ గ్యాంగ్... జమిచెట్టు బావి దగ్గర హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి సిద్ధిపేట జిల్లా లకుడారం గ్రామ సమీపంలో పూడ్చిపెట్టారు. ఈకేసులో వెంకటేష్ లతీఫ్ తో 10 లక్షల రూపాయలు సుపారీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

వీఆర్వో.. మాజీ హోం గార్డు
వెంకటేష్ వీఆర్వోగా పని చేసేవాడు. రియల్ ఎస్టేట్ భూముల వ్యవహారంలో తన వద్దకు వచ్చిన వారికి సాయం చేసేవాడు. లిటిగేషన్ భూముల సెటిల్‌మెంట్లలో రామకృష్ణగౌడ్‌కు అలా హెల్ఫ్ చేశాడు. రామకృష్ణ పోలీస్ శాఖలో హోంగార్డు, వెంకటేష్ వీఆర్వో కావడంతో లిటిగేషన్ భూముల అంశాన్ని క్యాష్‌గా చేసుకుని ఎన్నో సెటిల్‌మెంట్లు చేశారు. కూతురిని రామకృష్ణగౌడ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2020 ఆగస్టు 16న భార్గవితో రామకృష్ణగౌడ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అదును కోసం రెండ్రోజుల క్రితం రామకృష్ణగౌడ్‌ను హైదరాబాద్‌కు పిలుపించుకున్నాడు. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు.