హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. కోటి 10 లక్షల లంచం: ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్, అరెస్ట్

|
Google Oneindia TeluguNews

మేడ్చల్: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి మరో అవినీతి తిమింగలం చిక్కింది. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఏఎస్‌రావు నగర్‌లోని ఆయన నివాసంలో కోటీ 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. నాగరాజును అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. నాగరాజు ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

huge bribe: keesara tahsildar arrested

రాంపల్లి ప్రాంతంలో 28 ఎకరాల భూ సెటిల్మెంట్ల విషయంలో పెద్ద మొత్తంలో ఈ లంచం తీసుకుంటూ ఉండగా.. ఏసీబీ అధికారులు నాగరాజును పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏసీబీ చరిత్రలోనే ఇదే అతి పెద్ద ట్రాప్‌గా తెలుస్తోంది.

తహసీల్దార్ నాగరాజు సహా రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనాథ్, కన్నడ అంజిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, గతంలో ఈ ఎమ్మార్వోపైనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉందని తెలిసింది. మూడు నెలల క్రితమే ఆ కేసు నుంచి విముక్తి పొందినట్లు అధికారులు తెలిపారు.

English summary
huge bribe: keesara tahsildar arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X