వరి కొనుగోలు కేంద్రం నిర్ణయిస్తే ఇక కేసిఆర్ బోడి పెత్తనం ఎందుకు.?రైతు వేదన దీక్షలో నిలదీసిన షర్మిళ

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి కొనుగోలు విషయంలో ఒకరి మీద ఒకరు నెపం మోపుకుంటూ అన్నం పెట్టే రైతన్న నోట్లో సున్నం కొడుతున్నారని వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిళ ధ్వయెత్తారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌రిధాన్యం కొన‌బోమ‌ని చెబుతున్న నేప‌థ్యంలో రైతుల‌కు అండ‌గా నిలిచేందుకు వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ ష‌ర్మిల ధర్నా చౌక్ వ‌ద్ద "రైతు వేద‌న" నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా కేంద్ర బీజేపి ప్రభుత్వ వైఖరిని, తెలంగాణ రాష్ట్ర విధానాలను ఎండగట్టారు. వరి కుప్పల మీదే రైతులు చచ్చిపోతున్నా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని షర్మిళ మండిపడ్డారు.

 వరి కుప్పల మీదే రైతుల ఆత్మహత్యలు .. కేసీఆర్ చోద్యం చూస్తున్నారన్న షర్మిళ

వరి కుప్పల మీదే రైతుల ఆత్మహత్యలు .. కేసీఆర్ చోద్యం చూస్తున్నారన్న షర్మిళ

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో వడ్లు ఎందుకు కొనడం లేదని వైయస్ షర్మిళ సీఎం చంద్రశేఖర్ రావును సూటిగా ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో వరి ధాన్యం కొనడంలో ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంటని ఆమె సూటిగా ప్రశ్నించారు. వచ్చే యాసంగిలో కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ మాత్రమే కొంటానన్న విషయాన్ని చంద్రశేఖర్ రావు ముందుకు తీసుకువచ్చి, ప్రస్తుత వానా కాలం వడ్లను కొనే బాధ్యత నుంచి తప్పించుకోవాలని చంద్రశేఖర్ రావు భావిస్తున్నారని షర్మిళ మండిపడ్డారు. ఇది రైతాంగం పట్ల చంద్రశేఖర్ రావుకు ఉన్న కపట ప్రేమకు నిదర్శనమని షర్మిళ దుయ్యబట్టారు.

 ఆకరి గింజ వరకు వడ్లు కొనాలి.. కేసీఆర్ కుదరదంటే సంహించేది లేదన్న షర్మిళ

ఆకరి గింజ వరకు వడ్లు కొనాలి.. కేసీఆర్ కుదరదంటే సంహించేది లేదన్న షర్మిళ

అసలు ప్రొక్యూర్ మెంట్ టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు కదా, ఈ వానా కాలంలో 40 లక్షల టన్నులు ఎఫ్ సీఐ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది కదా, మరి ఎందుకు చంద్రశేఖర్ రావు రైతుల నుంచి వడ్లు కొనడం లేదని, ఎందుకు కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదని షర్మిళ ప్రశ్నించారు. సీఎం చంద్రశేఖర్ రావుకు వరి ధాన్యం కొనే ఉద్దేశ్యం ఉందా లేదా అని షర్మిళ నిలదీసారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్ గా చంద్రశేఖర్ రావు వ్యవమరిస్తూ రాష్ట్ర రైతు ప్రయోజనాలను మంటగలుపుతున్నారని షర్మిళ ధ్వజమెత్తారు

 ధర్నాలు చేయాల్సింది ఇక్కడ కాదు.. దమ్ముంటే ఢిల్లీలో చేయాలని షర్మిళ సవాల్

ధర్నాలు చేయాల్సింది ఇక్కడ కాదు.. దమ్ముంటే ఢిల్లీలో చేయాలని షర్మిళ సవాల్

ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం ఆంక్షలు పెట్టిన రోజునే ఢిల్లీలో దర్నా చేయకుండా రాష్ట్రంలో చేయడం ఏంటని చంద్రశేఖర్ రావును షర్మిళ ప్రశ్నించారు. ఆంక్షలు పెట్టిన రోజే ఢిల్లీలో కదా ప్రెస్ మీట్లు పెట్టాలి..? రోజుల తరబడి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లు పెడితే ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు. రాష్ట్రంలో చేస్తున్న ధర్నాలు కూడా ఎవరిని ఉద్దరించడానికని షర్మిళ తెలంగాణ ప్రభుత్వాన్నినిలదీసారు. చంద్రశేఖర్ రావుకు దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు, ప్రెస్ మీట్ లు నిర్వహించాలని షర్మిళ డిమాండ్ చేసారు.

 మద్దత్తు ధర చెల్లించడంలో మడతపేచీ.. రైతులకు అండగా ఉంటామన్న షర్మిలక్క

మద్దత్తు ధర చెల్లించడంలో మడతపేచీ.. రైతులకు అండగా ఉంటామన్న షర్మిలక్క

అంతే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ అవసరమనుకుంటే అక్కడ ఇన్ పుట్, విత్తనాల సబ్సిడీ, పంట భీమాను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చారని, పెట్టుబడిని తగ్గించి రాబడిని పెంచారని, అందుకే ఆ రోజు రైతు రాజు అయ్యారని షర్మిళ చెప్పుకొచ్చారు. రైతులకు మద్దతు ధర కూడా చంద్రవేఖర్ రావు ఇవ్వలేక పోతున్నారని, పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, చతీస్ గడ్ , కేరళలలో మద్దతు ధరతో పాటు ధాన్యాన్ని బోనస్ ఇచ్చి కొంటున్నారని, మద్దతు ధర మీద భోనస్ ఇచ్చి పక్క రాష్ట్రాలు రైతులను ఆదుకుంటుంటే, చంద్రశేఖర్ రావు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారని షర్మిళ ఘాటుగా స్పందించారు.

 పంట మార్చుకోవడం అంటే బట్టలు మార్చుకోవడం కాదు.. వ్యవసాయ మంత్రికి షర్మిళ చురకలు

పంట మార్చుకోవడం అంటే బట్టలు మార్చుకోవడం కాదు.. వ్యవసాయ మంత్రికి షర్మిళ చురకలు

అంతే కాకుండా పంటమార్పుకోసం తెలంగాణ రైతాంగంలో చైతన్యం తీసుకొస్తున్నామన్న వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాక్యలను షర్మిళ తప్పుబట్టారు. పంటలు మార్చుకోవడం అంటే బట్టలు మార్చుకున్నంత సులభమనుకుంటున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఇతర పంటలు వేసుకునే భరోసా రైతుకు కలిగేంత వరకు ప్రభుత్వమే వరి కొనాలని పేర్కొన్నారు. ఇతర పంటలపై మద్దతు ధర, ఎరువులు ఇచ్చేంత వరకు చంద్రశేఖర్ రావు వరి కొనాలని షర్మిళ డిమాండ్ చేసారు. ధర్నా చౌక్ లో 6గంటల వరకు మాత్రమే నిరాహార దీక్షకు అనుమతి ఇచ్చారు కాబట్టి మిగతా నిరాహార దీక్ష లోటస్ పాండ్ లో కొనసాగించాలని షర్మిళ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+