వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెల్‌కమ్ వ్యూహం: ఎమ్మెల్యే టిక్కెట్లలో కోటా పెంచాలి, కెసిఆర్‌‌ను కోరిన తుమ్మల?

తెలంగాణ సీఎం కెసిఆర్ 'వెల్‌కమ్' వ్యూహం అనుసరిస్తున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులను చిత్తు చేసేందకు ఈ వ్యూహం పనికొస్తోందని కెసిఆర్ భావిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం కెసిఆర్ 'వెల్‌కమ్' వ్యూహం అనుసరిస్తున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులను చిత్తు చేసేందకు ఈ వ్యూహం పనికొస్తోందని కెసిఆర్ భావిస్తున్నారు. అయితే అదే సమయంలో రానున్న ఎన్నికల్లో తమ సామాజికవర్గానికి ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను పెంచాలని కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు సీఎం కెసిఆర్‌ను కోరినట్టు తెలుస్తోంది.కనీసం 10 అసెంబ్లీ టిక్కెట్లను వచ్చే ఎన్నికల్లో ఇవ్వాలని కెసిఆర్‌ను కోరారాని ప్రచారం సాగుతోంది.

వెల్‌కమ్ వ్యూహం: వైఎస్ అప్పుడలా, కెసిఆర్ ధీమా అదేనా?వెల్‌కమ్ వ్యూహం: వైఎస్ అప్పుడలా, కెసిఆర్ ధీమా అదేనా?

Recommended Video

TRS and Congress workers Throw Chairs at each Other, Video

2019 ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటీకీ తెలంగాణలో రాజకీయాలు అప్పుడే వేడేక్కాయి. తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు టిఆర్ఎస్ నాయకత్వం వ్యూహలను రచిస్తోంది. ఈ మేరకు 'వెల్‌కమ్' వ్యూహన్ని సమర్థవంతంగా అమలు చేస్తే రాజకీయంగా ప్రయోజనం కలుగుతోందని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.

రేవంత్‌కు షాక్: టిడిపికి 12 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు, కెసిఆర్ వెల్‌కమ్ వ్యూహమిదే!రేవంత్‌కు షాక్: టిడిపికి 12 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు, కెసిఆర్ వెల్‌కమ్ వ్యూహమిదే!

ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టిడిపితో పొత్తు పెట్టుకోవాలని టిఆర్ఎస్ భావిస్తోందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ ప్రచారాన్ని బలపర్చేలా టిడిపి తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహ్ములు ఇటీవల కాలంలో చేస్తున్న ప్రకటనలున్నాయి.టిఆర్ఎస్‌తో పొత్తుకు సై అంటూ మోత్కుపల్లి ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తును మోత్కుపల్లి నర్సింహ్ములు తీవ్రంగా వ్యతిరేకించారు.

చంద్రబాబుపై తిరుగుబాటు: అప్పుడు నాగం, ఇప్పుడు రేవంత్చంద్రబాబుపై తిరుగుబాటు: అప్పుడు నాగం, ఇప్పుడు రేవంత్

ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను పెంచాలని కోరిన కమ్మ నేతలు

ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను పెంచాలని కోరిన కమ్మ నేతలు

తెలంగాణ రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గానికి 2019 ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు సీఎం కెసిఆర్‌ను కోరినట్టు ప్రచారం సాగుతోంది.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కమ్మ సామాజికవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నవారిలో ఆరుగురు మాత్రమే ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను పెంచాలని కమ్మ సామాజిక వర్గం నేతలు కెసిఆర్‌ వద్ద ప్రతిపాదించినట్టు సమాచారం. కమ్మ సామాజికవర్గం నుండి తుమ్మల నాగేశ్వర్‌రావు, అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, పువ్వాడ అజయ్‌కుమార్, కోనేరు కోనప్ప, భాస్కర్‌రావులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే తుమ్మల నాగేశ్వర్‌రావు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కెసిఆర్ కేబినెట్‌లో పనిచేస్తున్నారు.

10 ఎమ్మెల్యే సీట్లు కావాలంటున్న కమ్మ నేతలు

10 ఎమ్మెల్యే సీట్లు కావాలంటున్న కమ్మ నేతలు

తమ జనాభా ప్రకారంగా అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేదని కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతల అభిప్రాయంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను పెంచాలని ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు. వారం రోజుల క్రితం కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారని సమాచారం. 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ తరపున కనీసం పది ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని కమ్మ సామాజికవర్గం నేతలు కోరుతున్నారన ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళారని అంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వెలమ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పది మంది ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కనీసం ఆ సామాజికవర్గానికి తగ్గట్టుగా టిక్కెట్లు ఇవ్వాలంటున్నారు.

రాజకీయంగా ప్రయోజనమేనా?

రాజకీయంగా ప్రయోజనమేనా?

కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎక్కువ సీట్లను కేటాయిస్తే రాజకీయంగా టిఆర్ఎస్‌కు ప్రయోజనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టిడిపితో పొత్తు పెట్టుకొంటే రాజకీయంగా టిఆర్ఎస్‌కు కలిసివచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం కూడ లేకపోలేదు.అదే సమయంలో కమ్మ సామాజికవర్గానికి ఎక్కువ టిక్కెట్లు కేటాయించినా రాజకీయంగా కలిసివచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.జిహెచ్ఎంసితో పాటు, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ లాంటి జిల్లాల్లో ఈ ప్రభావం కన్పించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

2019 ఎన్నికల్లో వెల్‌కమ్ వ్యూహం గట్టిక్కించేనా?

2019 ఎన్నికల్లో వెల్‌కమ్ వ్యూహం గట్టిక్కించేనా?

2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను 'వెల్‌కమ్' గట్టెక్కించేనా? అనే చర్చ సాగుతోంది. తెలంగాణలో రాజకీయంగా బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని అడ్డుకొనేందుకు కమ్మ సామాజికవర్గంతో కెసిఆర్ సఖ్యత ఉండాలని నిర్ణయం తీసుకొన్నారంటున్నారు. గతంలో జలగం వెంగళరావు ఇదే వ్యూహన్ని అనుసరించి సక్సెస్ అయ్యారు. అదే వ్యూహన్ని కెసిఆర్ అనుసరిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే కెసిఆర్ ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహనికి హజరయ్యారు. అంతేకాదు శ్రీరామ్ వివాహనికి ఎర్రబెల్లి దయాకర్‌రావు మినహ కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్ళారు. ఈ వివాహ సమయంలో కెసిఆర్‌తో టిడిపి నేతలు సన్నిహితంగా మెలిగారు.

English summary
There is a spreading a rumour Kamma caste leaders urged to Kcr increase MLA tickets for them in 2019 elections.recently Kamma caste MLA's meeting at Hyderabad. They urged to Kcr increse MLA tickets 6 to 10 in 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X