నగరంలో పెరిగిన ఉష్ణోగ్రత..! వడ దెబ్బ తగలకుండా జీహెచ్ఎంసీ ముందు జాగ్రత్త..!!

హైద‌రాబాద్ : ఉక్కపోత లేకుండా కాస్త చల్లగా ఉండే హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఎండ హైదరాబాద్ సగరంలో ఉండకపోవడం పెద్ద అస్సెట్ గా ఉండేది. కాని ప్రస్తుతం నగరంలో కూడా ఎండలు మండిపోతుండడంతో నగర వాసులు బెంబేలెత్తి పోతున్నారు. దీంతో నగర పాలక సంస్థ అప్రమత్తమైంది. నగర ప్రజలు ఎండ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం నగర కమీషనర్ ఉన్నతాదికారులతో సమీక్ష నిర్వహించారు.

ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు..! బెంబేలెత్తిపోతున్న జనాలు..!!

ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు..! బెంబేలెత్తిపోతున్న జనాలు..!!

న‌గ‌రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున ప్రధాన కూడ‌ళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వ‌ద్ద చ‌లివేంద్రాల ఏర్పాటుతో పాటు అసంపూర్తిగా ఉన్న బ‌స్‌షెల్టర్ల నిర్మాణం పూర్తి, వాట‌ర్ ఏటిఎంల‌న్నింటినీ పూర్తిస్థాయిలో ప‌నిచేయించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌నర్ ఎం.దాన‌కిషోర్ వెల్లడించారు. పెరిగిన ఉష్ణోగ్రత‌ల నేప‌థ్యంలో చేప‌ట్టాల్సిన చ‌ర్యల‌పై జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి అధికారుల‌తో సోమవారం ప్రత్యేక స‌మావేశాన్ని దాన‌కిషోర్ నిర్వహించారు.

రంగంలోకి దిగిన యంత్రాంగం..! ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ..!!

రంగంలోకి దిగిన యంత్రాంగం..! ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ..!!

జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విప‌త్తుల నివార‌ణ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌, జ‌ల‌మండ‌లి డైరెక్టర్ అజ్మిరా కృష్ణ త‌దిత‌రులు హాజ‌రైన ఈ స‌మావేశంలో క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్‌ మాట్లాడుతూ... హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇప్పటికే ప‌లు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా చలివేంద్రాల‌ను ఏర్పాటు చేశాయ‌ని ఆదేశాలు జారీ చేసారు. వీటికి అద‌నంగా న‌గ‌రంలోని ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నళ్ల వ‌ద్ద రేప‌టి నుండి మ‌రిన్ని చ‌లివేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్నట్టు తెలిపారు.

అందుబాటులోకి వాటర్ ఏటీయంలు..! అప్రమత్తమైన అదికారులు..!!

అందుబాటులోకి వాటర్ ఏటీయంలు..! అప్రమత్తమైన అదికారులు..!!

హైద‌రాబాద్ న‌గ‌రంలో 129 వాట‌ర్ ఏటిఎంల‌ను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయ‌గా వీటిలో 102 ఏటిఎంలు పనిచేస్తున్నాయ‌ని నిర్వహ‌కులు తెలుపారు. అన్ని వాట‌ర్ ఏటిఎంలు ప‌నిచేసేలా చ‌ర్యలు చేప‌ట్టడంతో పాటు వాటి నిర్వహ‌ణ‌కు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాల‌ని సూచించారు.
హైద‌రాబాద్ న‌గ‌రంలో బ‌స్ షెల్టర్ నిర్మాణాలు పురోగ‌తిలో ఉన్నాయ‌ని, బ‌స్ షెల్టర్లు లేని ప్రాంతాల్లో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేయాల‌ని సంబంధిత ఏజెన్సీల‌ను కోరారు

సహాయం చేసేందుకు ముందుకొస్తున్న స్వచ్చంద సంస్థలు..! ప్రధాన కూడళ్ల వద్ద సహాయక చర్యలు..!!

సహాయం చేసేందుకు ముందుకొస్తున్న స్వచ్చంద సంస్థలు..! ప్రధాన కూడళ్ల వద్ద సహాయక చర్యలు..!!

న‌గ‌రంలో ఏర్పాటుచేసిన ఏసి బ‌స్ షెల్టర్లలో ఏసిలు ప‌నిచేయ‌డంలేద‌ని ఫిర్యాదులు అందుతున్నందున వాటిని త‌నిఖీచేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్‌ను కమిష‌న‌ర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ భాగ‌స్వామ్యంతో నిర్వహిస్తున్న లూ-కేఫేల‌లో కూడా ఉచితంగా మంచినీటిని అందించాల‌ని నిర్వాహ‌కుల‌ను ఆదేశించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఉన్న 2,283 బోర్‌వెల్స్ ను, 2,555 ప‌వ‌ర్ బోర్‌వెల్స్ అన్నింటిని ప‌నిచేసేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+